- Telugu News Photo Gallery Cricket photos Suryakumar Yadav Receives Man Of the Match awards for heroic Innings in 3rd T20I vs West Indies and creates 4 Other Records
IND vs WI: విండీస్‌పై సిక్సర్లతో చెలరేగిన సూర్య.. దెబ్బకి ఆ ముగ్గురి రికార్డ్‌లు బ్రేక్.. భారత్ తరఫున అరుదైన ‘సెంచరీ’..
IND vs WI 3rd T20I: భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లోనే 83 బంతులతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే సూర్య ఈ అవార్డ్‌నే కాక మరో 4 రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఆ రికార్డుల వివరాలివే..
Updated on: Aug 09, 2023 | 7:11 AM

Suryakumar Yadav: వెస్టిండీస్‌తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో భారత్ వరుసగా 2 మ్యాచ్‌లు ఓడిన సంగతి తెలిసిందే. అయితే సిరీస్ కోల్పోయే దశలో ఉన్న భారత్‌ని సూర్య కుమార్ యాదవ్ తన ఇన్నింగ్స్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో కాపాడాడు. 44 మ్యాచ్‌ల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్.. కేఎల్ రాహుల్ సిక్సర్ల రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌కి ముందు 77 టీ మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు బాదిన రాహుల్.. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడో ఆటగాడిగా ఉన్నాడు. అయితే తాజా మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన సూర్య 101 సెంచరీలను పూర్తి చేసుకోవడంతో పాటు కేఎల్ రాహుల్‌ని నాలుగో స్థానానికి నెట్టాడు. తద్వారా భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా అవతరించాడు.

51 మ్యాచ్‌ల్లో 101 సిక్సులు బాదిన సూర్య భారత్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా కూడా నిలిచాడు. సూర్య కంటే ముందు రోహిత్, కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు.

రోహిత్ శర్మ ఇప్పటివరకు తాను ఆడిన 148 టీ20 మ్యాచ్‌ల్లో 182 సిక్సర్లు బాదగా.. 115 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 117 సిక్సర్లు కొట్టాడు. తాజాగా వీరి సరసన 101 సిక్సర్లతో సూర్య కూడా చేరాడు.

భారత్ తరఫున అత్యధిక టీ20 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రెండో ఆటగాడిగా కూడా సూర్య కుమార్ యాదవ్ అవతరించాడు. 15 అవార్డులతో కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, సూర్య 12 అవార్డ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో మూడో స్థానంలో ఉన్నాడు.

సూర్య తన 4 సిక్సర్లతో క్రిస్ గేల్ రికార్డ్‌ను కూడా సమం చేశాడు. 49 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా క్రిస్‌గేల్ ఉండగా, సూర్య కూడా 49 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్క్‌ని చేరుకున్నాడు. ఇక అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఈవిన్ లూయిస్ అగ్రస్థానంలో ఉన్నాడు. లూయిస్ 48 ఇన్నింగ్స్‌ల్లోనే 48 సిక్సర్లు బాదాడు.





























