Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue Deaths: ఆ దేశంలో కరోనా కంటే పెద్ద సమస్యగా డెంగ్యూ.. మరణాలు సంఖ్య ఎంతంటే..?

Dengue Deaths: ఇటీవల కురిసిన వర్షాలు, వాటి ఫలితంగా పెరిగిన దోమలతో ఆ దేశ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే డెంగ్యూ బారిన పడిన వందలాది మంది మరణిస్తున్నారు. అధికార లెక్కల ప్రకారం ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనన్ని మరణాలు ఈ ఏడాదే నమోదయ్యాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ గడిచిన 24 గంటల్లో మరిన్నీ డెంగ్యూ మరణాలు నమోదైనట్లు దృవీకరించా..

Dengue Deaths: ఆ దేశంలో కరోనా కంటే పెద్ద సమస్యగా డెంగ్యూ.. మరణాలు సంఖ్య ఎంతంటే..?
Dengue Patients in Bangladesh
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 08, 2023 | 10:05 PM

Dengue Deaths: ప్రపంచాన్ని అప్పుడెప్పుడో ప్లేగు వ్యాధి అల్లాడించిందని చదివాం.. రెండేళ్ల క్రితమే కరోనా మృత్యు తాండవాన్ని కళ్లారా చూశాం. అయితే బంగ్లాదేశ్ మాత్రం వాటన్నింటినీ దాటుకొని ఇప్పుడు మరో వ్యాధి చేతుల్లో చిక్కుకుంది. ఇటీవల కురిసిన వర్షాలు, వాటి ఫలితంగా పెరిగిన దోమలతో బంగ్లాదేశ్‌ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే డెంగ్యూ బారిన పడిన వందలాది మంది మరణిస్తున్నారు. బంగ్లాదేశ్ చరిత్రలో లేనన్ని మరణాలు ఈ ఏడాదే నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 293కి చేరుకోగా.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ గడిచిన 24 గంటల్లో 10 డెంగ్యూ మరణాలు నమోదైనట్లు ధృవీకరించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 293కి చేరుకుంది. ఇది బంగ్లాదేశ్‌లో 2022లో నమోదైన 281 డెంగ్యూ మరణాలను దాటవేయడం విచారకరం.

బంగ్లాదేశ్ లెక్కల ప్రకారం ఆగస్టు 3న మొత్తం డెంగ్యూ కేసులు 59,716. అయితే వీటిలో ఒక్క ఢాకాలోనే 32,562 కేసులు నమోదయ్యాయి. అక్కడి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే డెంగ్యూ ప్రమాదం ఆ దేశంలో ఏడాది పొడవునా ఉంటుంది. ఇక 2019లో అత్యధికంగా 101,350 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఆసుపత్రులన్నీ డెంగ్యూ రోగులతో నిండిపోయాయి. అలాగే డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో వైద్యులకు కూడా కష్టతరం అవుతోంది. ఈ పరిస్ధితులకు తోడు డెంగ్యూకు ప్రత్యేకంగా చికిత్స చేసే మందు లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు.

ఇవి కూడా చదవండి

మరోవైపు నిలకడగా ఉన్న నీటిలోనే ఈ డెంగ్యూకి కారణమయ్యే ఏడేస్ ఏజిప్టి అనే దోమ వృద్ధి చెందుతుందని, వర్షాకాలంలోనే బంగ్లాదేశ్ వ్యాప్తంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆ దేశ వైద్యులు, నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జహంగీర్‌నగర్‌ యూనివర్సిటీ ఎంటమాలజీ ప్రొఫెసర్‌ కబీరుల్‌ బషర్‌ మాట్లాడుతూ.. ‘ఏప్రిల్‌లో రుతుపవనాలకు ముందు వర్షాలు ప్రారంభమైనప్పుడు ఏడిస్‌ దోమలు వృద్ధి చెందాయి. ఈ వైరస్‌ ఇప్పటికే సమాజంలో వ్యాపించడంతో మరింతగా వ్యాపిస్తోంది. దాని ఫలితాన్నే మనం చూస్తోన్నాం. జూలైలోనే ఇంత ఎక్కువ సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇది బహుశా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మరింతగా పెరుగుతుంద’ని వివరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..