Bill Gates: నిద్ర అనవసరమే అనుకున్నా.. నిద్రపై కీలక వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ నిద్ర గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మొదట్లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించినప్పడు అసలు నిద్రపోవడాన్నే సోమరితనంగా, అనవసరమైనందిగా భావించినట్లు పేర్కొన్నారు. నిద్ర గురించి బిల్‌గెట్స్ తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. తాను 30 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్నప్పుడు నిద్ర గురించి వివిధ రకాల సంభాషణలు వచ్చేవని పేర్కొన్నారు. తాను ఆరు గంటల వరకు నిద్రపోయానని ఒకరు చెబితే.. మరొకరు ఐదు గంటలే పడుకునేవారని.. కొన్నిసార్లు నిద్ర కూడా పోయేవారు కాదని అనేవారని చెప్పారు.
Updated on: Aug 08, 2023 | 10:30 PM

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ నిద్ర గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మొదట్లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించినప్పడు అసలు నిద్రపోవడాన్నే సోమరితనంగా, అనవసరమైనందిగా భావించినట్లు పేర్కొన్నారు.

నిద్ర గురించి బిల్‌గెట్స్ తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. తాను 30 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్నప్పుడు నిద్ర గురించి వివిధ రకాల సంభాషణలు వచ్చేవని పేర్కొన్నారు. తాను ఆరు గంటల వరకు నిద్రపోయానని ఒకరు చెబితే.. మరొకరు ఐదు గంటలే పడుకునేవారని.. కొన్నిసార్లు నిద్ర కూడా పోయేవారు కాదని అనేవారని చెప్పారు.

అసలు నిద్ర అనేది బద్ధకం అని, అనవసరమని భావించి నిద్ర పోకుండా ఉండేందుకు ప్రయత్నించేవాన్నని చెప్పారు. కానీ 2020లో మాత్రం నిద్రపై తన అభిప్రాయం పూర్తిగా మరిపోయిందని చెప్పారు.

తన తండ్రి అల్జీమర్స్ వల్ల మృతి చెందడమే అందుకు కారణమన్నారు. అప్పటి నుంచి నిద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నానో.. ఎంత సుఖంగా నిద్రపోతున్నానో లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిపారు.

వాస్తవానికి మనకు బయటకు బయటకు కనిపించే ఆరోగ్యమే ప్రధానం కాదని.. మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. యుక్త వయసులో ఉన్నప్పుడే ఎక్కవ సేపు నిద్రపోవడం అలవాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. వాస్తవానికి మనకు బయటకు బయటకు కనిపించే ఆరోగ్యమే ప్రధానం కాదని.. మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. యుక్త వయసులో ఉన్నప్పుడే ఎక్కవ సేపు నిద్రపోవడం అలవాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.





























