Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 30 నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు.. అన్ని ఆర్జిత సేవలు రద్దు
విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 1 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి ,అందంగా ముస్తాబు కానుంది. అంతేకాదు కనకదుర్గమ్మకు సుప్రభాతం సేవ, స్నపనాభిషేకాన్ని ఈ నెల 30 తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నారు
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోవాలు జరుగనున్నాయి. ఈ నెల ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 తేదీ వరకు మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం, పవిత్ర మాల ధారణ చేశారు. అనంతరం దుర్గమ్మను భక్తులు దర్శించుకోవడానికి ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతినిస్తారు.
విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 1 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి ,అందంగా ముస్తాబు కానుంది. అంతేకాదు కనకదుర్గమ్మకు సుప్రభాతం సేవ, స్నపనాభిషేకాన్ని ఈ నెల 30 తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల్లో మొదటి రోజున అమ్మవారి దర్శనాన్ని ఉదయం 9 గంటల నుంచి అనుమతిస్తామని ఆలయ సిబ్బంది పేర్కొంది.
మూడో రోజైన సెప్టెంబరు 1న ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలనూ రద్దు చేస్తారు. అమ్మవారికి దేవస్థాన అర్చకులు నిత్య కైంకర్యాలు నిర్వహించనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..