- Telugu News Photo Gallery Spiritual photos If you do this on Thursday, there will be good fortune at home
Thursday Remedies: గురువారం రోజున ఇలా చేస్తే ఇంట్లో సిరిసంపదలు.. బృహస్పతి స్థానం బలోపేతం..
హిందూమత ఆచారల ప్రకారం శ్రీ మహావిష్ణువు, బృహస్పతిని గురువారం రోజున ప్రజలు పూజిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలోపేతం అవడానికి ఈ రోజు (గురువారం) చాలా అనుకూలమైన రోజు అని అంటున్నరు వేద పండితులు. ముఖ్యంగా గురువు బలంగా ఉన్న వ్యక్తుల జీవితంలో అంతా శుభమే జరుగుతుందని వారు చెబుతున్నారు. ఒకవేళ బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తులు ఎప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుండతారు. అయితే, గురువారం రోజు ఈ వీక్ విధంగా చేయడం ద్వారా జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుందని సూచిస్తున్నారు వేదపండితులు. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Aug 10, 2023 | 8:36 AM

గురువారం తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి తర్వాత పూజగదిలో ఉన్న విష్ణువును పూజించాలి. కాలవ వత్తితో నెయ్యి దీపాన్ని వెలిగించి, అందులో కాస్త కుంకుమ వేయాలి. ఇలా చేస్తే నారాయణుడు సంతోషించి, మీపై కరుణ చూపుతాడు.

గురువారం రోజున విష్ణు చాలీసా, విష్ణు సహస్త్రనామం పఠిస్తే మీ కుటుంబ సభ్యులకు శ్రీ మహా విష్ణువు ఆశీర్వాదం లభించి జీవితంలో పురోగతి సాధిస్తారు. గురువారం ఉదయం స్నానం చేసిన గంగాజలంతో పూజగదిని శుభ్రం చేసి ఆచారాల ప్రకారం విష్ణువును పూజించాలి. ఆ తర్వాత విష్ణు కథ చదవాలి. కుశ ఆసనంపై కూర్చొని మాత్రమే విష్ణు చాలీసా, విష్ణు సహస్త్రనామం చదవాలి.

శ్రీ మహావిష్ణువుకు పసుపు అంటే చాలా ఇష్టం. గురువారం విష్ణు చాలీసా, విష్ణు సహస్రనామం చదివిన తర్వాత కొన్ని పుసుపు రంగులో ఉన్న పదార్థాలను, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. అరటి పండు, బొప్పాయి వంటి పండ్లను గురువారం నాడు అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేయడం వలన జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది.

గురువారం నాడు కుంకుమతో పూజలు చేస్తే జాతకంలో గ్రహ బలం మెరుగవుతుంది. ఆ రోజు రాత్రి నిద్రపోయేముండు పాలలో కుంకుమ పువ్వును కలిపి తాగాలి. పాలు, కుంకుమ పువ్వుతో ఖీర్ చేసి విష్ణువుకు నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా ఆరగించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.

గురువారం రోజు మీకు తెలిసిన ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉంటే వారికి ఏవైనా దానం, బహుమతిగా ఇవ్వాలి. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం వలన మీ జీవితంలో అంతా శుభమే జరుగుతంది.