- Telugu News Photo Gallery Spiritual photos Shivling Puja: If Shivling is at home then worship with this method, do not make these mistakes even by mistake
Shivling Puja at Home: ఇంట్లో శివలింగ పూజ చేస్తున్నారా.. ఈ పొరపాటు కూడా ఈ పని చేయకండి.. కష్టాలు తప్పవు
శ్రావణ మాసంలో వరలక్ష్మీ, మంగళగౌరి దేవిలను మాత్రమే కాదు శివ కేశవులను కూడా అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ముఖ్యంగా శివయ్యను అత్యంత భక్తి శ్రద్దలతో అభిషేకిస్తారు. అయితే కొందరు శివాయలంలో పూజలను చేస్తే.. మరికొందరు ఇంట్లోని పూజగదిలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తారు.
Updated on: Aug 10, 2023 | 11:01 AM

కొంతమంది భక్తులు శ్రావణ మాసంలోనే కాదు, ఇంట్లో ప్రతిరోజూ శివలింగాన్ని పూజించి మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతిరోజూ అభ్యంగన స్నానం కూడా చేస్తారు. అయితే శివపూజకు, శివుని అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో పూజగదిలో ఉన్న శివలింగాన్ని పూజించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

శివారాధనలో ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. నిర్మల హృదయం.. భక్తి శ్రద్దలతో మహాదేవుడిని హరహర మహాదేవ శంభో శంకర అంటూ జలాన్ని సమర్పించినా శివయ్య సంతృప్తి చెంది భక్తులు కోరిన కోర్కెలు తీరతాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో శివలింగ పూజ నియమాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించినట్లయితే, క్రమం తప్పకుండా పూజ చేయండి. సమయాభావం వల్ల లేదా మరేదైనా కారణం వల్ల శివలింగానికి అభిషేకం చేయలేకపోతే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించకండి. క్రమం తప్పకుండా శివలింగాన్ని పూజించకపోతే, మీరు మహాదేవుని ఆగ్రహానికి గురవుతారు. చెడు ప్రభావం ఆ ఇంటిపై పడుతుందని విశ్వాసం.

ఇంట్లో ప్రతిష్టించే శివలింగం మీ బొటనవేలు పొడవు కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే శివ పురాణంలో మీరు మీ బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచుకుంటే అది జీవితంలో చెడు ప్రభావాలను కలిగిస్తుందని చెప్పబడింది

ఇంట్లో శివలింగం ఉంటే ఎల్లప్పుడూ ఉత్తరం ముఖంగా నీటిని సమర్పించాలని గుర్తుంచుకోండి. పొరపాటున కూడా దక్షిణం లేదా తూర్పు ముఖంగా నీరు పెట్టవద్దు. ఉత్తరం వైపున ఉన్న నీటిని సమర్పించడం వల్ల శివ పార్వతుల ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం

ఉక్కు పాత్రలో శివునికి నీళ్ళను సమర్పించవద్దు. ఎందుకంటే ఇలా చేయడం అశుభంగా పరిగణిస్తారు. ఎల్లప్పుడూ రాగి పాత్రలో నిండుగా ఉన్న నీటిని శివునికి సమర్పించండి. ఇత్తడి పాత్రలను కూడా ఉపయోగించవచ్చు.

పొరపాటున కూడా శివుని రుద్ర విగ్రహాన్ని ఇంట్లో ఉంచవద్దు. అలాంటి చిత్రాన్ని కలిగి ఉండటం కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది, ప్రతి విషయంలోనూ తగాదాలు , సమస్యలు ఎదురవుతాయి.





























