- Telugu News Photo Gallery Spiritual photos Health Astrology in Telugu: These zodiac signs to have healthy year ahead
Health Astrology: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ ఏడాది ఏయే రాశులవారు ఆరోగ్యవంతులు? మీ రాశికి ఇలా..
Astrology in Telugu: ఆరోగ్యానికి గురు గ్రహం కారకుడు కాగా, అనారోగ్యానికి శనీశ్వరుడు కారకుడు. జాతక చక్రంలో ఆరవ స్థానం రోగ స్థానం కాగా, 11వ స్థానం ఆరోగ్య స్థానం. ముఖ్యంగా రాశి నాథుడు (లేదా లగ్నాధిపతి) బలంగా ఉంటే సాధారణంగా అనారోగ్యబాధ ఉండదు. ఒకవేళ అనారోగ్యం పట్టుకున్నా త్వరగా కోలుకోవడం జరుగుతుంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Aug 10, 2023 | 10:03 PM

జ్యోతిష శాస్త్రంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆరోగ్యానికి గురు గ్రహం కారకుడు కాగా, అనారోగ్యానికి శనీశ్వరుడు కారకుడు. జాతక చక్రంలో ఆరవ స్థానం రోగ స్థానం కాగా, 11వ స్థానం ఆరోగ్య స్థానం. ముఖ్యంగా రాశి నాథుడు (లేదా లగ్నాధిపతి) బలంగా ఉంటే సాధారణంగా అనారోగ్య బాధ ఉండదు. ఒకవేళ అనారోగ్యం పట్టుకున్నా త్వరగా కోలుకోవడం జరుగుతుంది. ఈ ఏడాది ఏయే రాశుల వారు అనారోగ్యాల పాలయ్యేదీ, ఎప్పుడు ఏ విధంగా కోలుకునేదీ ఇక్కడ స్థూలంగా పరిశీలిద్దాం.

మేషం: ఈ రాశివారు సాధారణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీద శ్రద్ధ చూపిస్తారు. చిన్నపాటి అనా రోగ్యం కలిగినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం జరుగుతుంది. ఈ రాశివారికి ఈ ఏడాది ఎక్కు వగా బీపీ, చర్మవ్యాధులు, నిద్రలేమి, నేత్ర సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. తలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మందుల వాడకం కంటే ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశముంది.

వృషభం: ఈ రాశివారికి ఒకపట్టాన అనారోగ్యాలు దగ్గరకు రావు. వస్తే తొందరగా విడిచిపెట్టవు. సాధారణంగా ఈ రాశివారు భోజనప్రియులు. అందువల్ల ఆహారం తీసుకోవడానికి సంబంధించి క్రమశిక్షణ పాటిం చాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా కొలస్టెరాల్, థైరాయిడ్, డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలతో వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలు కనిపించినప్పుడు వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. జ్వరాలు, వైరల్ ఫీవర్లు వంటివి వీరి దగ్గరికి రావడం చాలా తక్కువ.

మిథునం: ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటుంటారు. వీరిని ఎక్కువగా ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటాయి. గొంతు సంబంధమైన వ్యాధులు, కీళ్ల నొప్పులు వంటివి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి ఏటా ఏదో ఒక అనారోగ్య సమస్య వీరిని పీడిస్తూ ఉంటుంది. వ్యసనాల కారణంగా కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రాశివారు తప్పని సరిగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. సమతుల్య ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

కర్కాటకం: సాధారణంగా ఈ రాశివారికి తేలికగా అనారోగ్యాలు పట్టుకుంటూ ఉంటాయి. ఎక్కువగా గుండె, ఛాతీ సమస్యలకు ఆస్కారముంటుంది. ఎలర్జీలతో కూడా ఇబ్బందులు పడుతుంటారు. ప్రకృతిలో మార్పు వచ్చినప్పుడల్లా వీరు అనారోగ్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. ఏదైనా అనా రోగ్య సమస్య పట్టుకుంటే అది నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఏడాది ఎక్కువగా ఎలర్జీలు, వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబులతో అవస్థలు పడడం జరుగుతుంది.

సింహం: ఈ రాశివారు సాధారణంగా గుండె, వెన్నముక, ఎముకలు, చర్మ సంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. ఈ ఏడాది ఎక్కువ కాలం అనారోగ్యాలకు గురయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా అనారోగ్యం పట్టుకున్నా దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. వీరికి అనారోగ్య భయాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించడం జరుగుతుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల కన్నా స్వల్పకాలిక అనారోగ్యాలకే ఎక్కువ అవకాశం ఉంటుంది.

కన్య: జీర్ణాశయ సంబంధమైన సమస్యలు, నడుం నొప్పి, ఊబకాయం వంటివి బాధించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఇవి కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. శస్త్రచికిత్సల అవసరం కూడా ఉండవచ్చు. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడంతో పాటు, చిన్నపాటి వ్యాయా మం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడటానికి అవకాశముంటుంది. ఏదైనా ఒక దీర్ఘకాలిక సమస్య పట్టుకునే సూచనలు కూడా ఉన్నాయి. వ్యసనాలను తగ్గించుకోవడం కూడా మంచిది.

తుల: ఈ రాశివారికి ఈ ఏడాది పొత్తి కడుపు సమస్యలు, ప్యాంక్రియాస్ సమస్యలు, షుగర్, మానసిక ఒత్తిడి వంటివి అవస్థ పెట్టే అవకాశం ఉంటుంది. వైద్య ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఉపయోగం ఉంటుంది. తరచూ వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. సాధారణంగా ఈ రాశివారిని దీర్ఘకాలిక వ్యాధులు పట్టుకుంటే త్వరగా వదిలిపెట్టే అవకాశం ఉండదు.

వృశ్చికం: ఈ రాశివారికి ఎక్కువగా బీపీ, రక్త సంబంధమైన సమస్యలు, మొలలు, హెర్నియా, మర్మావయ వాల సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యాలు తప్ప సాధారణ వ్యాధులు వచ్చే అవకాశముం డదు. శస్త్ర చికిత్సల అవసరం కూడా ఉంటుంది. తరచూ పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను సంప్రదించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పనికి రాదని గుర్తుంచుకోవాలి.

ధనుస్సు: ఈ రాశివారు ఎక్కువగా టైఫాయిడ్, డయాబెటిస్, భుజాలు, మోకాళ్లు, ఎముక సంబంధమైన అనారోగ్యాలు, పుండ్లు, కణుతులతో అవస్థలు పడుతుంటారు. అతిగా శ్రమ పడడం వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ ఏడాది వీరిని తరుణ వ్యాధుల కంటే డయాబెటిస్, కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక అనా రోగ్య సమస్యలే ఎక్కువగా బాధించే సూచనలున్నాయి. ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి.

మకరం: ఈ రాశివారికి ఎక్కువగా చర్మవ్యాధులు, రక్త సమస్యలు, కీళ్ల నొప్పులు, నరాల సమస్యలు పట్టి పీడిస్తుంటాయి. సాధారణంగా ఆహార, విహారాల్లో క్రమశిక్షణ పాటించడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వంటివి ఉన్నప్పటికీ, ఈ ఏడాది ఈ రాశివారికి చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు పట్టుకునే సూచనలున్నాయి. వైద్య ఖర్చులు మరీ ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. ఈ రాశివారికి వాకింగ్, వ్యాయామం వంటివి ఎక్కువగా మేలు చేస్తాయి.

కుంభం: బీపీ, కీళ్లు, రక్తం, నిద్రలేమి, నరాల సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇవన్నీ జీవనశైలికి సంబం ధించిన సమస్యలు అయి ఉండే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, తరచూ వైద్యులను సంప్రదించడం వంటి పనుల వల్ల అనారోగ్యాలు అదుపులో ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు అవకాశం ఇవ్వకపోవడం చాలా మంచిది.

మీనం: కాళ్లు, చేతులు, భుజాలు, మోచేతులు, మోకాళ్లు వంటి అవయవాలకు సంబంధించిన సమస్యలు తరచూ చుట్టుముడుతుంటాయి. యాక్సిడెంట్ల కారణంగా కాళ్లు గానీ, చేతులు గానీ విరగడం కూడా జరుగుతుంటుంది. వ్యాయామం చేయడం, ఆహారపరంగా ఒక పద్ధతికి కట్టుబడి ఉండడం, వాకింగ్ చేయడం వంటి పనుల వల్ల చాలావరకు మేలు జరుగుతుంది. ఈ ఏడాది ఎక్కువగా కాళ్ల నొప్పులు, భుజాల నొప్పులకు అవకాశం ఉంది. సాధారణంగా స్వల్పకాలిక సమస్యలే ఎక్కువగా బాధిస్తాయి.





























