Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: ఈ 5 విషయాలు పాటిస్తే.. మీ జీవితంలో ఎలప్పుడూ ఇబ్బందులు ఉండవట.!

జీవితం అన్నాక ఆనందం, దుఃఖం రెండూ ఉంటాయి. అయితే మత గ్రంధాల ప్రకారం.. ఓ వ్యక్తి జీవితంలో అనేకసార్లు సమస్యలు...

Garuda Puranam: ఈ 5 విషయాలు పాటిస్తే.. మీ జీవితంలో ఎలప్పుడూ ఇబ్బందులు ఉండవట.!
Garuda Puranam
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 16, 2021 | 5:04 PM

జీవితం అన్నాక ఆనందం, దుఃఖం రెండూ ఉంటాయి. అయితే మత గ్రంధాల ప్రకారం.. ఓ వ్యక్తి జీవితంలో అనేకసార్లు సమస్యలు చుట్టుముడితే.. అది అతడి స్వంత కర్మ. మంచి పనులు మనిషి జీవితాన్ని మెరుగుపరిస్తే.. చెడు పనులు మనిషిని బాధల్లోకి, సమస్యల్లోకి నెట్టేస్తాయి.

ఒక వ్యక్తి తన కర్మను బట్టి పొందే ఫలాలను గరుడ పురాణం పేర్కొంటుంది. ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు, మరణాంతరం, మరో జన్మ పొందే వరకు అతని జీవితంలో అతడు చేసుకున్న కర్మ ఫలితం ప్రభావం చూపిస్తుందని గరుడ పురాణం అంటోంది. మరి ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా, మరణం తర్వాత కూడా అతడికి మోక్షం లభించాలంటే ఏం చేయాలి.? ఆ పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోజుకు ఐదు దాణాలు:

గరుడ పురాణం ప్రకారం.. ఆహారాన్ని తయారు చేసిన అనంతరం మొదటిగా ఆవుకు, చివరిగా మిగిలినది వృధా కాకుండా కుక్కకు పెట్టాలి. ఇది మాత్రమే కాకుండా పక్షులకు, చేపలకు, చీమలకు కొంచెం.. కొంచెం.. ఆహారాన్ని పెట్టాలి. ఒకవేళ మీరు వీటన్నిటికి పెట్టలేకపోతే కనీసం ప్రతీరోజూ ఒకరికైనా ఆహారాన్ని ఇవ్వాలని గరుడ పురాణం పేర్కొంటోంది.

అన్నదానం చేయండి:

అన్ని దానాలలో కంటే అన్నదానం గొప్పదానంగా పరిగణిస్తారు. పేదలు, నిరుపేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి జీవితం మాత్రమే కాదు.. అతడి ఏడు తరాలు కూడా సుఖసంతోషాలతో ఉంటాయి.

ధ్యానం:

మీ ఆలోచనలను శుద్ధి చేయడంతో పాటు దేవుడితో కనెక్ట్ కావడానికి క్రమం తప్పకుండ ధ్యానం చేయండి. అలాగే కుటుంబంలో సంతోషాన్ని, శాంతిని నింపేందుకు నిజాయితీతో శ్రమించి డబ్బు సంపాదించండి. అడ్డదారులు తొక్కొద్దు.

కుటుంబ చిహ్నం(Totem):

గరుడ పురాణం ప్రకారం, మీ 7 తరాలు దేవతలు ప్రసన్నమైతేనే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి మీ టోటెమ్‌(Totem)ని ఎప్పుడూ అగౌరవపరచవద్దు. దానికి ప్రత్యేక తేదీలలో పూజలు జరపండి.

దేవుడి ఆశీర్వాదాలు:

మీకు ఏది లభించినా.. అది దేవుడు మీకిచ్చిన వరమే. ఇక ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒకే ఒక మార్గం.. మీకు లభించిన ప్రతీది, ఏది స్వీకరించినా.. ముందుగా దేవుడి పాదాల దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదాలు తీసుకోండి. అలాగే ఇంట్లో సిద్దం చేసిన ఆహారాన్ని మొదటిగా దేవుడికి అర్పించాలి. ఇలా చేయడం ద్వారా, లక్ష్మీదేవి కృప కుటుంబంపై ఎలప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ దేనికీ లోటు ఉండదు. అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ఉంటాయి.

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!