AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీతారాముల కళ్యాణానికి విశిష్ట అతిథిగా గరుడ పక్షి.. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన ఆలయ పరిసరాలు

విష్ణుమూర్తి వాహనం గరుడ పక్షి. విష్ణువు దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. భూమిపై సాధారణ మానవుడిగా జన్మించి, ఆదర్శప్రాయమైన జీవనాన్ని పొందిన రాముడు హిందువుల ఆరాధ్య దైవం. సీతారాములకు వివాహం జరిపించడం,....

సీతారాముల కళ్యాణానికి విశిష్ట అతిథిగా గరుడ పక్షి.. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన ఆలయ పరిసరాలు
Garuda Pakshi
Ganesh Mudavath
|

Updated on: Apr 18, 2022 | 2:42 PM

Share

విష్ణుమూర్తి వాహనం గరుడ పక్షి. విష్ణువు దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. భూమిపై సాధారణ మానవుడిగా జన్మించి, ఆదర్శప్రాయమైన జీవనాన్ని పొందిన రాముడు హిందువుల ఆరాధ్య దైవం. సీతారాములకు వివాహం జరిపించడం, వేడుకలు, ఉత్సవాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే బాపట్ల జిల్లాలోని చదలవాడ రఘునాయకస్వామి వారి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్వామికి తలంబ్రాలు పోసే సమయంలో ఓ గరుడ పక్షి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఈ కమనీయ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెప్పారు. బాపట్ల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహొత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన రఘునాయక స్వామి వారి దేవాలయానికి ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. సీతా దేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.

garuda pakshi

garuda pakshi

తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారని అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు వచ్చిందని స్థల పురాణం. చతుర్వాటిక కాలక్రమంలో చదలవాడగా మారింది. ఏటా చైత్రశుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణ వేడుకల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదే, స్వామివారి కళ్యాణం రోజున స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేస్తుంది.

ఈ రోజు ఉదయం 10 గంటలకు స్వామివారికి కళ్యాణ క్రతువు ప్రారంభించారు. స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసింది. భక్తులు గరుడపక్షిని చూసి భక్తిపారవశ్వం చెందారు. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. కన్నులపండువగా నిర్వహించిన ఈ కళ్యాణ వేడుకల్లో స్వామి వారికి సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పట్టువస్త్రాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి.

ఇవీ చదవండి

Samantha: ఆ ఆలోచనే మానుకోండి.. నెటిజన్లకు ఊహించని షాకిచ్చిన సమంత..

Shivani Rajasekhar: దేవకన్యలా మైమరిపిస్తున్న అందాల సుందరి ‘శివాని’ లేటెస్ట్ ఫొటోస్..

Sachin Tendulkar: సచిన్‌ బాల్యాన్ని గుర్తుచేసిన బస్సు.. లోకల్‌ బస్సులో ఎక్కి ప్రయాణించిన సచిన్..