AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నులపండువగా గోమాత కల్యాణోత్సవం… వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా వేడుక

హిందూ పురణాల్లో గోవుకు విశిష్ట స్థానం ఉంది. సకల దేవతలకు గోవు ఆధారం అని పురాణాలు చెప్పాయి. గోమాతను పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వార్ లో....

కన్నులపండువగా గోమాత కల్యాణోత్సవం... వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా వేడుక
Cow Marriage
Ganesh Mudavath
|

Updated on: Apr 18, 2022 | 3:10 PM

Share

హిందూ పురణాల్లో గోవుకు విశిష్ట స్థానం ఉంది. సకల దేవతలకు గోవు ఆధారం అని పురాణాలు చెప్పాయి. గోమాతను పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వార్ లో గోమాత కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మంత్రోచ్ఛరణల మధ్య గోవులకు ప్రత్యేక పూజలు చేసి, వివాహ క్రతువు నిర్వహించారు. శ్రీ అంబా త్రయ క్షేత్ర శక్తిపీఠంలో శ్రీ ఆదిత్య పర శ్రీగురువు ఆధ్వర్యంలో పశ్చిమాద్రి సంస్థాన పీఠాధిపతులు శ్రీ పంచమి సిద్ధిలింగ మహా స్వామీజీ ఆధ్వర్యంలో గోమాత కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మహాలక్ష్మి నిజ స్వరూపమే గోమాత అని, ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని వారణాసి శ్రీశ్రీ కాశీ నాగేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ప్రకృతి పచ్చగా ఉండాలంటే గోమాత సుభిక్షంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం వల్ల పాడిపంటలతో సుఖశాంతులతో ప్రజలు ఉంటారని ఉపదేశించారు. కరోనా వైరస్ వంటి భయంకరమైన వ్యాధులను కూడా తట్టుకునే శక్తి గోమాతను పూజించడం వల్ల కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలు అలవర్చుకొని దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు వెలిగించడం వల్ల సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, హిందూ ధర్మం ఎంతో గొప్పదని గోమాతను పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రభోదించారు.

పశుపక్ష్యాదులను పూజించే గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు మన భారతదేశానికి ఉన్నాయని స్వామీజీ చెప్పారు. గోవును పూజించడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి వివరించారు. గోమాత పూజ ఉత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Also Read

PPF Account: పీపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా..? ఈ నియమాలు తెలుసుకోండి

Shivani Rajasekhar: దేవకన్యలా మైమరిపిస్తున్న అందాల సుందరి ‘శివాని’ లేటెస్ట్ ఫొటోస్..

Buying House: సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఇది సరైన సమయమేనా..? పూర్తి వివరాలు..