TTD News: తిరుమల లడ్డూ తయారీలో “క్లీన్ కుకింగ్”.. ఇంధన ఆదా కోసం టీటీడీ నిర్ణయం
తిరుమల(Tirumala) లడ్డూను భక్తులు పరమపవిత్రంగా భావిస్తారు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారు కచ్చితంగా లడ్డూ ప్రసాదం రుచి చూడాల్సిందే. అంతే కాదు.. పొరుగు వాళ్లకూ పంచడం పద్ధతిగా వస్తోంది. తిరుమల పేరు చెబితేనే.. ముందుగా లడ్డూ గుర్తుకు...
తిరుమల(Tirumala) లడ్డూను భక్తులు పరమపవిత్రంగా భావిస్తారు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారు కచ్చితంగా లడ్డూ ప్రసాదం రుచి చూడాల్సిందే. అంతే కాదు.. పొరుగు వాళ్లకూ పంచడం పద్ధతిగా వస్తోంది. తిరుమల పేరు చెబితేనే.. ముందుగా లడ్డూ గుర్తుకు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో లడ్డూ(Laddu) తయారీ విధానంలో అధికారులు నూతన పద్ధతులను అవలంబిస్తున్నారు. తాజాగా క్లీన్ కుకింగ్ విధానంలో(Clean Cooking System) తిరుమల లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్‌ఈసీఎం)కు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ఓ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా బొగ్గు, విద్యుత్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి క్లీన్ కుకింగ్ విధానం ఉపయోగించడం ద్వారా కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించవచ్చు. విద్యుత్ బిల్లుల కోసం టీటీడీ ఏటా రూ.40 కోట్లు వెచ్చిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యల ద్వారా ఇందులో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. టీటీడీలో ఇది వరకు రోజుకు 34 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుండగా, ఇప్పుడు అది 44 లక్షల గ్యాలన్లకు చేరింది.
Also Read
INDBank Recruitment: ఇండ్‌బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 10 లక్షల వరకు జీతం పొందే అవకాశం..
Telangana: చిల్లరగాళ్లు.. చిరు వ్యాపారులను కూడా వదలడం లేదు…
KGF 2 Collection: బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న యశ్.. సునామీలా కలెక్షన్స్