INDBank Recruitment: ఇండ్‌బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 10 లక్షల వరకు జీతం పొందే అవకాశం..
INDBank Recruitment: ఇండియన్ బ్యాంక్ సబ్జిడిరీ సంస్థ అయితే ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?
INDBank Recruitment: ఇండియన్ బ్యాంక్ సబ్జిడిరీ సంస్థ అయితే ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అకకౌంట్ ఓపెనింగ్ స్టాప్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్స్ అండ్ నెట్‌వర్క్ ఇంజనీర్, వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ హెడ్, ఫీల్డ్ స్టాఫ్ వంటి పోస్టులు ఉన్నాయి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 21 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను హెడ్ అడ్మినిస్ట్రేషన్, నెం 480, కివ్‌రాజ్ కాంప్లెక్స్ 1, అన్నా సలయ్, నందనం, చెన్నై అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1.50 నుంచి రూ. 10 లక్షల వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 26-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Kim Jong Un: కొత్త రకం అణ్వాయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా.. ఆ అధికారులకు కిమ్ మామ కీలక సూచనలు
Free Police Training 2022: తెలంగాణ ఉచిత పోలీసు శిక్షణకు ప్రవేశ పరీక్ష.. 6 వేల మందికిపైగా హాజరు!
Artificial Bird: ఇది పక్షి కాదండి బాబు.. పక్షిలాంటిది.. క్రియేటివిటీ అదిరిందికదూ..!