AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: గ్రూప్స్‌ పోస్టులకి అప్లై చేస్తున్నారా.. ఇలా చేసేవారిపై కఠిన చర్యలు..!

TSPSC: త్వరలో తెలంగాణలో వరుసగా ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి. ఇప్పటికే సర్కారు ప్రకటించిన 80,039 ఉద్యోగాల్లో భాగంగా

TSPSC: గ్రూప్స్‌ పోస్టులకి అప్లై చేస్తున్నారా.. ఇలా చేసేవారిపై కఠిన చర్యలు..!
Tspsc
uppula Raju
|

Updated on: Apr 18, 2022 | 5:36 PM

Share

TSPSC: త్వరలో తెలంగాణలో వరుసగా ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి. ఇప్పటికే సర్కారు ప్రకటించిన 80,039 ఉద్యోగాల్లో భాగంగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌3, గ్రూప్4 పోస్టులు కూడా ఉన్నాయి. ఇటీవల ఈ పోస్టులకి ఇంటర్వ్యూలను ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీ మరో విషయంలో అభ్యర్థులని హెచ్చరిస్తోంది. నకిలీ సర్టిఫికెట్లతో మోసాలకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందాలని చూస్తే అభ్యర్థులను ఐదేండ్ల పాటు డిబార్ చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించింది.

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ మరో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వరుసగా విడుదలవుతాయి. టీఎస్‌పీఎస్సీ రూల్స్‌-పేరా 9 (ఏ) రూల్‌ 3 (11) ప్రకారం ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందాలని చూస్తే సదరు అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అలాగే టీఎస్‌పీఎస్సీ వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌)లో మార్పులు చేసుకొనే అవకాశం కల్పించింది. గతంలో ఫేక్‌ సర్టిఫికెట్లతో బురిడీ కొట్టించబోయి నలుగురు అభ్యర్థులు డిబార్‌ అయ్యారు. టీఆర్టీ హిందీ ఉద్యోగాలకు రాత పరీక్షను నిర్వహించి, మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించగా అభ్యర్థుల సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అభ్యర్థులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు తేలడంతో నోటీసులు జారీ చేసి, డిబార్‌ చేశారు.

ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫేక్‌ సర్టిఫికెట్లు సృష్టిస్తారని టీఎస్‌పీఎస్సీ దృష్టికి రావడంతో కమిషన్‌ అలర్ట్‌ అయింది. మూతబడ్డ స్కూళ్లు, కొన్ని ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. స్థానికేతరుల ఉద్యోగాలు కొల్లగొట్టే ప్రమాదం ఉండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎలాంటి అవకతవకలకి తావు లేకుండా ఉద్యోగాల ప్రక్రియ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Health News: మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువ.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!

Dinesh Karthik: దినేశ్‌ కార్తీక్ మళ్లీ చెలరేగాడు.. ఆ బంగ్లాదేశ్ బౌలర్ వేసిన ఒకే ఓవర్లో 28 పరుగులు..!

Viral Video: పాపం ఎలుక.. పిల్లికి అడ్డంగా దొరికిపోయిందిగా..!