Viral Video: పాపం ఎలుక.. పిల్లికి అడ్డంగా దొరికిపోయిందిగా..!

Viral Video: ఈ ప్రపంచంలో కొన్ని జంతువులు ఉన్నాయి. అవి మొదటి నుంచే ఒకదానికొకటి శత్రువులుగా భావిస్తాయి. ఉదాహారణకు కుక్క, పిల్లి, ఎలుక, పాము, ముంగీస మొదలైనవి ఉంటాయి.

Viral Video: పాపం ఎలుక.. పిల్లికి అడ్డంగా దొరికిపోయిందిగా..!
Cat Beating Rat
Follow us
uppula Raju

|

Updated on: Apr 17, 2022 | 11:58 AM

Viral Video: ఈ ప్రపంచంలో కొన్ని జంతువులు ఉన్నాయి. అవి మొదటి నుంచే ఒకదానికొకటి శత్రువులుగా భావిస్తాయి. ఉదాహారణకు కుక్క, పిల్లి, ఎలుక, పాము, ముంగీస మొదలైనవి ఉంటాయి. ఇవి ఒకదానికొకటి ఎదురుపడితే విధ్వంసమే. అయితే ఇందులో కుక్కలు, పిల్లులు పెంపుడు జంతువులు. పాశ్చాత్య దేశాలలో వీటిని ఎక్కువగా పెంచుకుంటారు. కానీ ఇండియాలో కుక్క.. పిల్లి వెంబడి పరుగుపెట్టడం మీరు చాలాసార్లు చూసే ఉంటారు. దాదాపు పిల్లిని పట్టుకునే వరకు వదలదు. అలాగే పాము, ముంగీస విషయంలో కూడా ఇదే జరుగుతంది. ఇవి రెండు ఎదురుపడ్డాయంటే యుద్దమే. వీటి తర్వాత చెప్పుకోవాల్సింది పిల్లి, ఎలుకల గురించి. ఎలుక పిల్లిని చూసిందంటే పరుగెత్తాల్సిందే. తాజాగా ఎలుక, పిల్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ఎలుక పిల్లికి అడ్డంగా దొరికిపోవడం మనం గమనించవచ్చు. దీంతో పిల్లి రెచ్చిపోయి ఎలుకని ఎడా పెడా వాయిస్తోంది. అది ఎటు వెళ్లకుండా చుట్టుముడుతుంది. ఎలుక తప్పించుకోడానికి ఎటువంటి మార్గం ఉండదు. దీంతో అక్కడక్కడే తిరుగతూ ఇబ్బంది పడుతుంది. పిల్లి మాత్రం రెండు చేతులతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాపం ఎలుక అంటూ జాలిపడుతున్నారు. అంతేకాదు తెగ నవ్వుకుంటున్నారు.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్‌కిటీ పేరుతో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 22 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అయితే 9 లక్షల 40 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. కొంతమందికి ఈ వీడియో చాలా ఫన్నీగా అనిపించింది. మరికొందరు పిల్లి ఎలుకను చంపే విధానం చాలా భయంకరమైనదని కామెంట్ చేశారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ చెప్పండి.

View this post on Instagram

A post shared by Cats ? (@cutekitye)

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులు అలర్ట్‌.. ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ని ఇలా యాక్టివేట్ చేసుకోండి..!

IPL 2022: దినేశ్‌ కార్తీక్ దెబ్బకి ఈ 15 కోట్ల ఆటగాడి పని గోవిందా.. జట్టులో చోటు కష్టమే..!

IPL 2022 Orange Cap: KL రాహుల్ రేసులోకి వచ్చేశాడు.. జోస్ బట్లర్‌తో పోటీకి రెడీ..!