IPL 2022 Orange Cap: KL రాహుల్ రేసులోకి వచ్చేశాడు.. జోస్ బట్లర్‌తో పోటీకి రెడీ..!
IPL 2022 Orange Cap: IPL 2022 ప్రస్తుత సీజన్ మూడు వారాలు పూర్తయింది. ఈ సీజన్‌లో 27 మ్యాచ్‌లు జరిగాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో వేడి పెరిగింది. గత కొన్ని రోజులుగా రాజస్థాన్
IPL 2022 Orange Cap: IPL 2022 ప్రస్తుత సీజన్ మూడు వారాలు పూర్తయింది. ఈ సీజన్‌లో 27 మ్యాచ్‌లు జరిగాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో వేడి పెరిగింది. గత కొన్ని రోజులుగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా పోటీలోకి వచ్చాడు. అతనితో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన దినేష్ కార్తీక్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తాను కూడా ఉన్నట్లు సంకేతాలు పంపాడు. ఐపీఎల్‌లో శనివారం చాలా పరుగులు వచ్చాయి. తొలుత కేఎల్ రాహుల్ సెంచరీ సాయంతో ముంబై ఇండియన్స్‌పై లక్నో 199 పరుగులు చేసింది. అనంతరం ముంబై 181 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. సాయంత్రం బెంగుళూరు, ఢిల్లీ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్, గ్లెన్ మాక్స్‌వెల్ అర్ధ సెంచరీల సహాయంతో బెంగళూరు 189 పరుగులు చేసింది. ఢిల్లీ 173 పరుగులతో బదులిచ్చింది.
బట్లర్‌కి దగ్గరగా రాహుల్
లక్నో కెప్టెన్ రాహుల్ 100వ మ్యాచ్‌లో అజేయంగా 103 పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. విశేషమేమిటంటే ఈ సీజన్‌లో ఇది రెండో సెంచరీ మాత్రమే. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్ తొలి సెంచరీ సాధించాడు. యాదృచ్ఛికంగా వారిద్దరు ముంబై ఇండియన్స్‌పైనే సెంచరీలు చేశారు. ఇప్పుడు ఈ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఆరెంజ్ క్యాప్ రేసులో మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నారు. బట్లర్ చాలా కాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 272 పరుగులు చేశాడు. అదే సమయంలో ఈ సెంచరీ సహాయంతో రాహుల్ 6 ఇన్నింగ్స్‌లలో 235 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (228) మూడో స్థానంలో ఉన్నాడు.
దినేశ్ కార్తీక్ బెంగళూరు నంబర్ వన్ బ్యాట్స్‌మెన్
దినేష్ కార్తీక్ కేవలం 34 బంతుల్లో 66 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో బెంగళూరు క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి ఢిల్లీని ఓడించింది. ఈ సీజన్‌లో దినేశ్ కార్తీక్ తొలి మ్యాచ్ నుంచి బెంగళూరు తరఫున నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పుడు అతను బెంగళూరు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్‌మెన్ కంటే చాలా ముందున్నాడు.