Viral Video: నదిలో కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగు.. ప్రాణాలకి తెగించిన తల్లి ఏనుగు.. గుండె తరుక్కుపోయే వీడియో..!

Viral Video: ఈ లోకంలో తల్లికి మించిన దైవం మరొకటి లేదు. ఈ భూమి మీద కదిలే దైవం తల్లి. అందుకే ప్రజలు తల్లిని దేవుడి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఏ తల్లి అయినా

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగు.. ప్రాణాలకి తెగించిన తల్లి ఏనుగు.. గుండె తరుక్కుపోయే వీడియో..!
Baby Elephant
Follow us
uppula Raju

|

Updated on: Apr 17, 2022 | 8:22 AM

Viral Video: ఈ లోకంలో తల్లికి మించిన దైవం మరొకటి లేదు. ఈ భూమి మీద కదిలే దైవం తల్లి. అందుకే ప్రజలు తల్లిని దేవుడి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఏ తల్లి అయినా తన పిల్లలు ఆపదలో ఉంటే తట్టుకోలేదు. అంతేకాదు వారికి చిన్నపాటి కష్టం కూడా రానివ్వకుండా చూసుకుంటుంది. అది మనిషి అయినా పశువు అయినా తల్లి ప్రేమలో తేడా ఉండదు. తాజాగా ఓ ఏనుగుకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో తల్లి ఏనుగు కనబరిచిన తెగువకి అందరు ఫిదా అవుతున్నారు. తల్లి ఏనుగుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఏనుగుల గుంపు నది దాటడానికి ప్రయత్నిస్తుంది. అందులో ఓ పిల్ల ఏనుగు నదీ ప్రవాహంలో కొట్టుకు పోతుంది. గమనించిన తల్లి ఏనుగు పిల్ల ఏనుగును కాపాడటానికి ప్రయత్నిస్తుంది. అప్పటికే చాలాదూరం కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగు వెంబడి పరుగెడుతుంది. అయితే కొన్ని ఏనుగులు అప్పటికే ఒడ్డుకు చేరుకుంటాయి. కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగుని చూసి సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. చివరికి తల్లి ఏనుగు నదీ ప్రవాహానికి ఎదురు నిలిచి తన తొండంతో పిల్ల ఏనుగుని అదిమి పట్టుకుంటుంది. నెమ్మదిగా ఒడ్డుకి చేర్చుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లి ఏనుగు సాహసానికి ఫిదా అవుతున్నారు.

ఒక నెటిజన్ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోని ఇప్పటివరకు లక్షల మంది తిలకించారు. లైక్స్‌, కామెంట్స్‌ చేస్తున్నారు. తల్లి ఏనుగు చేసిన సాహసాన్ని అందరు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు. ఒక నెటిజన్‌ ఇలా అన్నాడు ‘ తల్లి హృదయానికి అవధులు లేవు’. మరొక నెటిజన్ ‘ ఈ లోకంలో తల్లికి మించిన దైవం లేదు’ అన్నాడు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

చాణక్య నీతి: ఆర్థిక సంక్షోభాన్ని నివారించాలంటే ఈ 5 విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోండి..!

Health Care: పొట్టలో గ్యాస్‌ వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఈ పండ్లు తింటే మంచి ఉపశమనం..!

Health Tips: డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!