AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!

Health Tips: డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మీకు తీవ్రమైన తలనొప్పి రావచ్చు. కానీ ఇది మళ్లీ మళ్లీ వేధిస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి. అనేక కారణాల వల్ల డ్రైవింగ్‌ చేసేటప్పుడు

Health Tips: డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!
Headache During Driving
uppula Raju
|

Updated on: Apr 16, 2022 | 1:40 PM

Share

Health Tips: డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మీకు తీవ్రమైన తలనొప్పి రావచ్చు. కానీ ఇది మళ్లీ మళ్లీ వేధిస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి. అనేక కారణాల వల్ల డ్రైవింగ్‌ చేసేటప్పుడు తలనొప్పి సమస్య వస్తుంది. కాబట్టి దీన్ని అస్సలు తేలికగా తీసుకోకూడదు. లేదంటే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఏ కారణాల వల్ల తలనొప్పి వస్తుందో తెలుసుకోడానికి కచ్చితంగా ప్రయత్నించాలి. వాస్తవానికి కళ్లపై ఒత్తిడి ఉన్నప్పుడు తలనొప్పి ప్రారంభమవుతుంది. కంటి చూపు బలహీనంగా మారినందున ఇది జరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతిరోజూ డ్రైవ్ చేసేటప్పుడు మీ కంటి చూపుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. తేడాలని గమనించాలి. దీంతో పాటు ఆకలి కారణంగా కూడా తలనొప్పి సమస్య మొదలవుతుంది. మెదడుకి రక్త సరఫరా తగ్గిన కారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు తలనొప్పికి గురవుతారు. ఇలాంటి సమయంలో ఏదో ఒకటి తినడం మంచిది.

చాలా మందికి రక్తంలో షుగర్ లెవెల్ తగ్గడం వల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు తలనొప్పి వస్తుంది. అలాంటి సమయంలో వెంటనే పండ్లు తినాలి. ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండాలి. నీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కూడా తాగవచ్చు. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. తలనొప్పిగా ఉంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఇది మీ తలనొప్పిని నయం చేస్తుంది.కళ్లద్దాలు వాడేవారు ఎప్పటికప్పుడు కంటిచూపు పరీక్షలు చేయించుకోవాలి. తేడాలు వస్తే అద్దాలలో మార్పులు చేసుకుంటే మంచిది.

శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. నిద్ర లేకపోతే మీరు తలనొప్పి సమస్యని ఎదుర్కొంటారు. పరిశోధన ప్రకారం.. 6 లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయే వ్యక్తులకు ఎటువంటి తలనొప్పి ఉండదు. కానీ ఇంతకన్నా తక్కువ నిద్రపోతే తలనొప్పి వేధిస్తుంది. కాబట్టి రాత్రిపూట కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. తలనొప్పి, ఒత్తిడి, మానసిక సమస్యలు సహజమైన పద్దతిలో తగ్గించాలంటే అందుకు యోగా చేయడం సరైన మార్గం. దీనివల్ల జీవన నాణ్యతను మెరుగుపడుతుంది. డయాబెటీస్‌, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి యోగా దివ్య ఔషధంలా పనిచేస్తుంది. యోగా తలనొప్పి ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Hanuman Jayanti 2022: శని దోషం నుంచి విముక్తి కావాలంటే హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి..!