Diabetics: మధుమేహ రోగులు కచ్చితంగా ఈ 4 విషయాలపై దృష్టి సారించండి..!

Diabetics: భారతదేశంలో మధుమేహ రోగులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఒకప్పుడు వృద్దులలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తోంది.

Diabetics: మధుమేహ రోగులు కచ్చితంగా ఈ 4 విషయాలపై దృష్టి సారించండి..!
Diabetics
Follow us

|

Updated on: Apr 16, 2022 | 12:40 PM

Diabetics: భారతదేశంలో మధుమేహ రోగులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఒకప్పుడు వృద్దులలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. జీవన విధానంలో మార్పులు, సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల ఇది వేగంగా విస్తరిస్తోంది. మధుమేహ రోగులలో రక్తంలో చక్కెర సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు అనేక రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. వ్యాయామం చేయడం, సరైన నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి చేయడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్‌ చేయవచ్చు. మధుమేహం ఉన్న వ్యక్తి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలలో ఆహారం. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు ఆహారాలని తెలివిగా ఎంచుకోవాలి. అప్పుడే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

1. ఫైబర్

ఫైబర్స్ రక్తంలో గ్లూకోజ్ డెలివరీని నెమ్మదిస్తుంది. పీచు పదార్థాలలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ప్రతిరోజు వేర్వేరు సమయాల్లో ఆపిల్, నారింజ, బొప్పాయి వంటి పీచు పండ్లను తినడానికి ప్రయత్నించండి.

2. ప్రొటీన్‌

శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రొటీన్‌ మొదటి స్థానంలో ఉంటుంది. మధుమేహం ఉన్నవారు తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. కాబట్టి వారు శక్తిని పొందడానికి ప్రోటీన్ ఎక్కువగా అవసరమవుతుంది. కాబట్టి ప్రొటీన్ ఉన్న ఆహారాలని ఎక్కువగా తింటే మంచిది.

3. తక్కువ కొవ్వు

అనారోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఫలితంగా అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇలా కాకూడదంటే కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలని ఎంచుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ నూనెలను ఉపయోగించాలి. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్ టైరోసోల్ ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.

4. పిండి పదార్థాలు

మధుమేహ రోగులు పిండి పదార్థాలను పూర్తిగా తగ్గించాల్సిన అవసరం లేదు. ఓట్స్, బార్లీ వంటి ఆరోగ్యకరమైన పిండి పదార్థాలకి మారితే మంచిది. బార్లీలో కరిగే ఫైబర్‌లు ఉంటాయి. ఇవి గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Health Tips: దోసకాయ, కొత్తిమీర జ్యూస్‌తో బోలెడు లాభాలు.. డీ హైడ్రేషన్‌కి చక్కటి పరిష్కారం..!

Hanuman jayanti 2022: హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు మరిచిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!

Cold Water Side Effects: చల్లటి నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!