Hanuman jayanti 2022: హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు మరిచిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!

Hanuman jayanti 2022: హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ఆంజనేయుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి.

Hanuman jayanti 2022: హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు మరిచిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!
Hanuman Jayanti 2022
Follow us
uppula Raju

|

Updated on: Apr 16, 2022 | 10:21 AM

Hanuman jayanti 2022: హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ఆంజనేయుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. అందుకే హనుమాన్‌ని సంకత్మోచన్ అంటారు. హనుమంతుడు బ్రహ్మచారి కావడం వల్ల ఆయన పూజ చాలా పవిత్రంగా ఉండాలి. ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. చిన్న తప్పు చేసినా హనుమాన్‌కి కోపం వస్తుంది. ఈరోజు హనుమాన్‌ భక్తులు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు. అయితే హనుమాన్‌కి పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి.

1. హనుమాన్ విగ్రహాన్ని మహిళలు తాకకూడదనేది మొదటి నియమం. బ్రహ్మచారి అయినందున స్త్రీలు ఆయన విగ్రహాన్ని ముట్టుకోకూడదు. కానీ ఎవరైనా అతని చాలీసా, మంత్రం జపించవచ్చు.

2. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే పూజలు చేయకూడదు.

3. ఇంట్లో హనుమాన్ పూజిస్తున్నట్లయితే అతని విగ్రహానికి పగుళ్లు లేకుండా చూసుకోండి. ఆంజనేయుడి ఆరాధనకి ముందు గణపతిని, శ్రీరాముడిని పూజించాలి.

4. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే ఉప్పు జోలికి వెళ్లకండి. పగటిపూట నిద్రపోకూడదు. కావాలంటే ఒక 10 నిమిషాలు నిద్రపోవచ్చు. ఎక్కువ సమయం ఆంజనేయుడిని ధ్యానించండి. నిరుపేదలకు దానం చేయండి.

5. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడిని పూజిస్తే మాంసం, మద్యం ముట్టుకోకూడదు. అలా చేయడం పాపం.

6. ఈ రోజు బ్రహ్మచర్యాన్ని అనుసరించండి. ఇంట్లో గొడవల వాతావరణాన్ని సృష్టించవద్దు. ఎవరికీ చెడు చేయవద్దు. ఎవరికీ చెడు ఆలోచనలు తీసుకురావద్దు. మీ కష్టాలు తొలగిపోవాలని హనుమాన్‌ని ప్రార్థించండి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగిందని గమనించండి.

IPL 2022: 7.25 కోట్ల ఆటగాడు.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ మినహాయించి మిగతా ప్రదర్శన అంతంత మాత్రమే..!

Cold Water Side Effects: చల్లటి నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Peanuts Side Effects: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వేరుశెనగ తింటున్నారా.. అయితే ప్రమాదమే..!