AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Belur Temple: మత సామరస్యానికి ప్రతీక ఈ గొప్ప ఆచారం.. వేయేళ్ల చరిత్ర గల ఆలయంలో..

Belur Temple: కర్ణాటకలోని హాసన జిల్లా బేలూరులోని చెన్నకేశవస్వామి రథోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ వేడుకను కనులారా వీక్షించడానికి ఇతర జిల్లాల వారే కాకుండా, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా హాజరవుతుంటారు. ఏప్రిల్‌ 8న మొదలైన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే..

Belur Temple: మత సామరస్యానికి ప్రతీక ఈ గొప్ప ఆచారం.. వేయేళ్ల చరిత్ర గల ఆలయంలో..
Belur Temple
Narender Vaitla
|

Updated on: Apr 16, 2022 | 7:09 PM

Share

Belur Temple: కర్ణాటకలోని హాసన జిల్లా బేలూరులోని చెన్నకేశవస్వామి రథోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ వేడుకను కనులారా వీక్షించడానికి ఇతర జిల్లాల వారే కాకుండా, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా హాజరవుతుంటారు. ఏప్రిల్‌ 8న మొదలైన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ చిత్ర పటాన్ని అభిమానులు ప్రదర్శించారు. ఇక ఈ ఆలయం ప్రాముఖ్యత విషయానికొస్తే.. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రసిద్ధ చెన్నకేశవ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించారు. 116లో చోళులపై సాధించిన విజయాలకు గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఖురాన్‌ పఠించడం ఆచారం..

రథోత్సవాన్ని ప్రారంభించే కంటే ముందు ఖురాన్‌లోని ఆయత్‌లను చదవడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీని ఆలయ నిర్వాహకులు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా రథం లాగడానికి ముందు మౌల్వీ సయ్యద్ సజ్జాద్ బాషా ఖురాన్ ఆయత్‌లను ఆలపించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘రథోత్సవం ప్రారంభించే ముందు ఖురాన్‌లోని శ్లోకాలు పఠించడం మా పూర్వీకుల నుంచి వస్తోన్న ఆచారం. హిందూ ముస్లిం సోదరభావానికి చిహ్నంగా ఉండే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నిర్వహించాము’ అని చెప్పుకొచ్చారు.

ఈసారి వివాదం..

ఇదిలా ఉంటే ఈసారి వేడుకల్లో ఓ వివాదం చెలరేగింది. ఈ ఏడాది ఖురాన్‌ పఠనం చేయకూడదు అంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే ముస్లిం వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేయకూడదనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ అంశం కాస్త వివాదంగా మారడంతో ఏటా అనవాయితీగా వస్తోన్న ఆచారాన్ని పాఠించాలని, ఖురాన్‌ పఠనాన్ని కొనసాగించాలని అర్చకుల కమిటీ నిర్ణయం తీసుకోవడంతో ఎప్పటిలాగే ఈసారి కూడా రథోత్సవం పూర్తయింది.

Also Read: Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Ranveer singh: జిమ్ బాడీతో ట్రెండ్ సెట్టింగ్ లో బిజీగా బాలీవుడ్ కండల కాంతారావు రణవీర్ సింగ్…

Sridevi Shoban Babu : ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీ నుంచి అందమైన మెలోడి సాంగ్..

Follow Us
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోనుంది!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోనుంది!
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది