AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanuts Side Effects: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వేరుశెనగ తింటున్నారా.. అయితే ప్రమాదమే..!

Peanuts Side Effects: వంటింట్లో వేరుశెనగ లేకుండా దాదాపు ఏ ఇల్లు ఉండదు. చిరుతిండి నుంచి వివిధ వంటకాలు, చట్నీల వరకు వేరుశెనగను ఉపయోగిస్తారు. వీటిని

Peanuts Side Effects: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వేరుశెనగ తింటున్నారా.. అయితే ప్రమాదమే..!
Peanuts
uppula Raju
|

Updated on: Apr 16, 2022 | 9:21 AM

Share

Peanuts Side Effects: వంటింట్లో వేరుశెనగ లేకుండా దాదాపు ఏ ఇల్లు ఉండదు. చిరుతిండి నుంచి వివిధ వంటకాలు, చట్నీల వరకు వేరుశెనగను ఉపయోగిస్తారు. వీటిని పేదల బాదం అని పిలుస్తారు. వేరుశెనగ తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. పొటాషియం, ఐరన్, జింక్ , విటమిన్-ఈ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో వేరుశెనగ తినడం మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వేరుశనగను అస్సలు తినకూడదు. ఏ సమస్యలతో బాధపడేవారు వేరుశెనగకి దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

1. థైరాయిడ్ సమస్య

మీకు థైరాయిడ్ సమస్య ఉంటే వేరుశెనగ తీసుకోవడం వల్ల మీ TSH స్థాయి పెరుగుతుంది. అందుకే వేరుశెనగ తినకూడదు. ఒకవేళ మీరు వేరుశెనగ తినాలనుకుంటే చాలా పరిమిత పరిమాణంలో తినాలి. అలాగే మందులు వాడుతున్నప్పుడు వేరుశెనగ తీసుకోకపోవడం ఉత్తమం.

2. అలెర్జీ సమస్య

మీకు అలెర్జీ ఉంటే వేరుశెనగలు తినడం మంచిది కాదు. ఎందుకంటే చేతులు, కాళ్ళలో దురద, నోటిపై వాపు లేదా చర్మంపై దద్దుర్లు సంభవించవచ్చు. వేరుశెనగలు ఎండాకాలంలో పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

3. కాలేయ సమస్య

కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు వేరుశెనగను తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తినకూడదు. వాస్తవానికి వేరుశెనగలో కొన్ని మూలకాలు ఉంటాయి. ఇవి కాలేయంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ముఖ్యంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు వీటికి దూరంగా ఉండటమే మంచిది.

4. కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేరుశెనగ తినడం మానుకోవాలి. ఇది లెక్టిన్‌లను కలిగి ఉంటుంది. ఇది నొప్పిని మరింత పెంచుతుంది.

5. అధిక బరువు

మీరు అధిక బరువు కలిగి ఉంటే వేరుశెనగను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే వేరుశెనగలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వేరుశెనగలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఉంటాయి వీటిని అధికంగా తీసుకుంటే బరువు తగ్గడంలో సమస్య ఏర్పడవచ్చు.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రేమకి చిహ్నం.. ఇది మాత్రమే కాదు చాలా కట్టడాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి..!

High Blood Pressure: అధిక రక్తపోటుకి ఇవే ముఖ్య కారణాలు.. అదుపులో లేకుంటే అంతే సంగతులు..!

Health Tips: వయసు ప్రభావం ముఖంపై కనిపించకూడదంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!