uppula Raju |
Updated on: Apr 16, 2022 | 7:11 AM
అధిక సోడియం తీసుకోవడం వల్ల చాలామంది రక్తపోటు బారిన పడుతున్నారు. భోజనంలో ఉప్పును తగ్గించడంతో పాటు ప్యాకేజ్ ఫుడ్‌లో సోడియం మోతాదును తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
అధిక ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎప్పుడైనా ప్రమాదమే.. కాబట్టి ఉప్పుని తక్కువ తీసుకోవాలి. వేయించిన ఆహారాలకి దూరంగా ఉండాలి.
అధిక ఒత్తిడి మీ రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండండి. ఇది మీ నరాలను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. తీవ్రమైన ఒత్తిడి మీ రక్తనాళాలను దెబ్బతీస్తుంది.
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. దీనివల్ల అధిక రక్తపోటు ఏర్పడుతుంది. గుండె ఆగిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది.
పొటాషియం శరీరంలో సోడియం పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం స్థాయిలను పెంచడానికి మంచి ఆహారం తీసుకోవాలి.