Health Tips: వయసు ప్రభావం ముఖంపై కనిపించకూడదంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!
Health Tips: ఈ రోజుల్లో చెడ్డ జీవనశైలి, సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల ముఖంపై ముడతలు చిన్నవయసులోనే కనిపిస్తున్నాయి. ముఖంలోని సహజ మెరుపు మాయమవుతుంది.
Health Tips: ఈ రోజుల్లో చెడ్డ జీవనశైలి, సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల ముఖంపై ముడతలు చిన్నవయసులోనే కనిపిస్తున్నాయి. ముఖంలోని సహజ మెరుపు మాయమవుతుంది. అందంగా కనిపించడం కోసం చాలామంది మార్కెట్‌లోని అన్ని బ్యూటి ప్రొడాక్ట్స్‌ని వాడుతున్నారు. కానీ వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పించి ఎటువంటి ఫలితం ఉండదని ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. మీరు నిజంగా చాలా కాలం పాటు యవ్వనంగా, అందంగా కనిపించాలంటే వాడాల్సింది బ్యూటీ ప్రొడాక్ట్స్ కాదు. జీవనశైలి, ఆహారపు అలవాట్లని మెరుగుపరుచుకోవడం. దీనివల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. చర్మంపై సహజమైన మెరుపును తీసుకురావడంతో తోడ్పడతుంది. అలాంటి ఐదు ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. కొబ్బరి నీరు
కొబ్బరి నీళ్లలో విటమిన్ బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ కొబ్బరి నీళ్ళు తాగితే మీ చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. సహజంగా మెరుస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ముఖంపై ముడతలు రావు.
2. పుచ్చకాయ
వేసవిలో పుచ్చకాయ మార్కెట్‌లో విరివిగా దొరుకుతుంది. ఈ సీజన్‌లో తరచుగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో మీరు పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయలో చాలా నీరు ఉంటుంది. ఇది మీ శరీరానికి శక్తిని, పోషణను అందిస్తుంది. మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
3. టమోటా
టమోటాను కూరగాయగా ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని సలాడ్‌లలో కూడా వినియోగిస్తారు. ఇందులో విటమిన్-సి పెద్ద మొత్తంలో లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది. వయస్సు ప్రభావం నుంచి రక్షిస్తుంది. టొమాటో రసాన్ని ముఖానికి రాసుకోవచ్చు. కానీ రాళ్ల సమస్య ఉంటే నిపుణులను అడిగిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.
4. దోసకాయ
దోసకాయ వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. దోసకాయ మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది యాంటీఏజింగ్ ఎలిమెంట్లను కలిగి ఉన్నందున చర్మానికి చాలా మేలు చేస్తుంది. చర్మంపై దోసకాయ రసాన్ని ఉపయోగిస్తే ముడతలు కనిపించవు.
5. మామిడి
మామిడి వేసవిలో లభించే ఒక పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి పని చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు మామిడిని పండుగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.