- Telugu News Human Interest Five times new year in india tradition celebrated in different ways in different states
Knowledge Photos: ఇండియాలో కొత్త సంవత్సరం చాలాసార్లు వస్తుంది.. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా..!
Knowledge Photos: పాశ్చాత్య దేశాలలో నూతన సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. కానీ భారతదేశంలో కొత్త సంవత్సరం చైత్ర మాసంలో మొదలవుతుంది. ఇది మార్చి లేదా ఏప్రిల్‌లో వస్తుంది.
Updated on: Apr 15, 2022 | 11:42 AM

పాశ్చాత్య దేశాలలో నూతన సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. కానీ భారతదేశంలో కొత్త సంవత్సరం చైత్ర మాసంలో మొదలవుతుంది. ఇది మార్చి లేదా ఏప్రిల్‌లో వస్తుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు హిందూ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, బీహార్-జార్ఖండ్, ఒడిశా, బెంగాల్, ఈశాన్య భారతం, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈసారి ఏప్రిల్ 13, 14, 15 తేదీల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు.

పంజాబ్‌లో కొత్త సంవత్సరం బైసాఖీతో ప్రారంభమవుతుంది. ఖల్సా క్యాలెండర్ ప్రకారం ఇది సిక్కు నూతన సంవత్సరం. పంజాబ్‌లో బైసాఖి రోజున భాంగ్రా, గిద్దా వంటి సంప్రదాయ నృత్యాలు చేస్తారు.

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈ నెలలోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అస్సాంలో, బిహు పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. రైతులకు అంకితం చేసే ఈ పండుగను పంటల పండుగ అని అంటారు.

పశ్చిమ బెంగాల్‌లో కొత్త సంవత్సరాన్ని పోహెలా బోయిషాఖ్‌తో జరుపుకుంటారు. చైత్ర మాసం ముగియగానే అంటే బైశాఖ్‌లో బెంగాలీ నూతన సంవత్సరం వస్తుంది. వైశాఖ మాసం మొదటి రోజును బెంగాల్‌లో పొయిలా బోయిషాఖ్ అంటారు.

మహారాష్ట్రలో కొత్త సంవత్సరం గుడి పడ్వాతో ప్రారంభమవుతుంది. ఇది కూడా చైత్ర మాసంలో జరుపుకుంటారు. దీనిని మరాఠీ పడ్వా అని కూడా అంటారు.

ఉగాది పండుగను దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మొదలైన వాటిలో వైభవంగా జరుపుకుంటారు. రైతులు కూడా కొత్త పంట చేతికి వచ్చిందన్న ఆనందంగా జరుపుకుంటారు.





























