Health Tips: మూత్రం ఈ రంగులో వస్తే జాగ్రత్త..!
Health Tips: భారతదేశంలో కిడ్నీ రోగులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మారిన జీవన పరిస్థితులు, చెడ్డ అలవాట్ల కారణంగా కిడ్నీ
Health Tips: భారతదేశంలో కిడ్నీ రోగులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మారిన జీవన పరిస్థితులు, చెడ్డ అలవాట్ల కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువవుతున్నాయి. మరొక విషయం ఏంటంటే కిడ్నీ పాడై పోయినట్లు గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి పూర్తిగా చెడిపోయిన తర్వాతనే ఎక్కువగా తెలుస్తుంది. కానీ కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల కిడ్నీ పాడయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఆల్కహాల్, అధిక రక్తపోటు, మధుమేహం లేదా కొన్ని మందులు తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. చాలా నష్టం జరిగిన తర్వాత కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని సమస్యలు దాని ప్రారంభ లక్షణాలుగా గుర్తించవచ్చు. మూత్రవిసర్జన తగ్గడం, కీళ్లలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, శరీరంలో దురద, రోజంతా అలసట, రాత్రి నిద్ర పట్టడం కష్టమవడం, ఆకలి లేకపోవడం, శారీరక బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటివి ఉంటాయి. మూత్రం రంగు మీ కిడ్నీల గురించి కొంత సూచనను ఇస్తుంది. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
1. లేత పసుపు రంగు – శరీరం బాగా హైడ్రేటెడ్‌గా ఉంటుందని అర్థం.
2. ముదురు పసుపు రంగు – శరీరంలో నీరు లేకపోవడం అంటే డీహైడ్రేషన్ అర్థం.
3. ఆరెంజ్ రంగు – శరీరంలో తీవ్రమైన నీటి నష్టమని అర్థం.
4. పింక్ లేదా ఎరుపు రంగు – మూత్రంలో రక్తం కలుస్తుందని అర్థం.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.