PM Modi: ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్.. రానున్న పదేళ్లలో రికార్డ్ స్థాయిలో కొత్త వైద్యులు .. ప్రధాని మోడీ

PM Modi: రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచిస్తుందని.. దీంతో  పదేళ్లలో దేశంలో రికార్డు స్థాయిలో కొత్త డాక్టర్లు వస్తారని ప్రధాని నరేంద్ర మోడీ..

PM Modi: ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్.. రానున్న పదేళ్లలో రికార్డ్ స్థాయిలో కొత్త వైద్యులు .. ప్రధాని మోడీ
Pm Naredra Modi
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2022 | 4:24 PM

PM Modi: రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచిస్తుందని.. దీంతో  పదేళ్లలో దేశంలో రికార్డు స్థాయిలో కొత్త డాక్టర్లు వస్తారని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) శుక్రవారం చెప్పారు. గుజరాత్‌లోని (Gujarat) భుజ్ జిల్లాలో కెకె పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ( KK Patel Super Speciality Hospital) ప్రారంభించిన ప్రధాని మోడీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ వైద్య విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని.. దేశంలో అందరికీ వైద్య విద్యను చేరువ చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీంతో భారత్‌లో రాబోయే 10 సంవత్సరాలలో రికార్డు స్థాయిలో కొత్త వైద్యులు తయారవుతారని మోడీ చెప్పారు.  భుజ్‌లోని ఆసుపత్రి ప్రజలకు అందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తుందని అన్నారు.

“రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో కేవలం 1,100 సీట్లతో తొమ్మిది మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. అయితే గత 20 ఏళ్లలో స్థానికంగా వైద్య విద్యారంగం చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు. నేడు మనకు 6,000 సీట్లతో ఒక ఏయిమ్స్‌, 36 కంటే ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయి,” అని చెప్పారు. రాజ్‌కోట్‌లోని ఎయిమ్స్‌ సైతం.. 2021 నుంచి 50 మంది విద్యార్థులను చేర్చుకుంటోంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా 2001లో భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. భుజ్, కచ్ ప్రజలు “ఇప్పుడు తమ కష్టార్జితంతో ఈ ప్రాంతానికి కొత్త అదృష్టాన్నితీసుకొచ్చారని ప్రశంసించారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు అనేక ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఇప్పుడు భుజ్ లోని సూపర్ స్పెషాలిటీ తో ప్రజలకు వైద్యం మరింత చేరువైందని చెప్పారు.

‘మెరుగైన ఆరోగ్య సదుపాయాలు’ అనే అర్థం కేవలం వ్యాధుల చికిత్సకు మాత్రమే పరిమితం కాదని, సామాజిక న్యాయానికి కూడా పరిమితం అని మోడీ పేర్కొన్నారు. పేదవారు కూడా తక్కువ ధరలో నాణ్యమైన చికిత్స పొందినప్పుడు.. వ్యవస్థపై మరింత విశ్వాసం నెలకొంటుందని ప్రధాని చెప్పారు.

KK పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని శ్రీ కుచ్చి లేవా పటేల్ సమాజ్, భుజ్ నిర్మించారు. ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకారం, ఇది కచ్‌లోని మొదటి ఛారిటబుల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. 200 పడకలతో నిర్మించబడింది. హాస్పిటల్ “ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ (క్యాథ్లాబ్), కార్డియోథొరాసిక్ సర్జరీ, రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, న్యూరో సర్జరీ, జాయింట్ రీప్లేస్‌మెంట్, ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తుంది. ప్రయోగశాల, రేడియాలజీ మొదలైన సహాయక సేవలుకూడా ఈ ఆస్పత్రిలో నెలకొల్పారు.

Also Read:

Kakinada: శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి.. పలువురికి గాయాలు.. ముగ్గురు పరిస్థితి విషమం

Godfather: మెగాస్టార్‌ను ఇరుకున పడేసే పాత్రలో డైనమిక్ డైరెక్టర్.. ‘గాడ్ ఫాదర్‌’లో పూరీ ఇలా..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?