Karnataka Rains: బెంగళూరులో భారీ వర్షాలు.. మరో 3 రోజులు కురిసే అవకాశం.. జనజీవనం అస్తవ్యస్తం.. ఒకరు మృతి..

Karnataka Rains: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నారు. రానున్న మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా..

Karnataka Rains: బెంగళూరులో భారీ వర్షాలు.. మరో 3 రోజులు కురిసే అవకాశం.. జనజీవనం అస్తవ్యస్తం.. ఒకరు మృతి..
Karnataka Heavy Rains
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2022 | 4:47 PM

Karnataka Rains: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నారు. రానున్న మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు(Bengaluru) లో పలు ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒకరు మృతి చెందారు. మృతుడిని పండ్ల వ్యాపారి వసంత్‌గా గుర్తించారు. మంగమ్మన్‌పల్లికి చెందిన 21 ఏళ్ల వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, బెంగళూరులోని యెలంచెనహళ్లిలో గురువారం కురిసిన వర్షానికి పొంగిపొర్లుతున్న డ్రెయిన్ నుంచి 60 ఇళ్లలోకి నీరు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ ఇళ్లు దాదాపు 4 అడుగుల మేర నీటిలో మునిగిపోయాయని ప్రజలు తెలిపారు. రోడ్లు నదులను తలపిస్తున్నారు. దీంతో రోడ్లమీద వాహనదారులు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి.  అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు కొన్ని చోట్ల చిక్కుకుపోయారు.

ఆగ్నేయ అరేబియా సముద్రం.. దానికి ఆనుకుని ఉన్న తుఫాను ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో కేరళ-మహే, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.  వచ్చే 3 రోజుల్లో లక్షద్వీప్‌లో, తమిళనాడు-పుదుచ్చేరి-కరైకల్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, నార్త్  కర్ణాటకలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Also Read: Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. పెండింగ్‌ చలాన్ల డిస్కౌంట్‌కు ఇంకా కొన్ని గంటలే..

PM Modi: ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్.. రానున్న పదేళ్లలో రికార్డ్ స్థాయిలో కొత్త వైద్యులు .. ప్రధాని మోడీ