Cooking Oil: పెరగనున్న పామాయిల్ ధరలు.. త్వరలోనే వంటింటికి కొత్త కష్టాలు.. కారణమేంటంటే..
Oil Price Hike: కొన్ని వారాలుగా దేశంలో వంట నూనెల ధరలో స్వల్పంగా తగ్గాయి. ఇంతలోనే కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని వల్ల మరోసారి వంట నూనెలు, రిఫైన్డ్ నూనె ధరలు మరోసారి పెరుగనున్నాయి.
Oil Price Hike: కొన్ని వారాలుగా దేశంలో వంట నూనెల(Cooking Oil) ధరలో స్వల్పంగా తగ్గాయి. ఇంతలోనే కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని వల్ల మరోసారి వంట నూనెలు, రిఫైన్డ్ నూనె(Refined Oil) ధరలు మరోసారి పెరుగనున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం, పెరిగిన ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఇది పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. ఇప్పటికే పెట్రోలు-డీజిల్, పాలు, పీఎన్‌జీ, వంట గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా తరువాత దేశంలో వంట నూనెల వినియోగం భారీగా పెరిగింది. ఈ తరుణంలో ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను మరింతగా తగ్గించాలని యోచిస్తోంది.
ధరల పెరుగుదల ఇందువల్లే..
కేంద్రం పామాయిల్ దిగుమతులపై టాక్స్ తగ్గించినప్పటికీ ధరలు మాత్రం తగ్గటం లేదు. ఇండోనేషియాలో పామాయిల్ సంక్షోభం కారణంగా, భారత్ లో వంట నూనెల ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం పామాయిల్ ఉత్పత్తి చేసే ఇండోనేషియాలోనే ఆయిల్ కొరత ఏర్పడింది. క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి దిగుమతులను తగ్గించడానికి డీజిల్‌లో 30 శాతం పామాయిల్ ను కలపడం తప్పనిసరి చేసింది. దీంతో బయోడీజిల్ అవసరాల కోసం పామాయిల్ ని ఆ దేశం వినియోగిస్తోంది. దీని కారణంగా 17.1 మిలియన్ టన్నుల పామాయిల్ ఉత్పత్తిలో.. 7.5 మిలియన్ టన్నులు బయో డీజిల్‌కు, మిగిలిన 9.6 మిలియన్ టన్నులు గృహ, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఒక్క సారిగా ఇండోనేషియాలో ఒక్కసారిగా పామాయిల్ ధరలు చుక్కలను తాకాయి. దీని వల్ల అక్కడి ప్రభుత్వం ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. మార్చి 2021లో ఇండోనేషియాలో ఒక లీటరు బ్రాండెడ్ వంట నూనె ధర 14,000 ఇండోనేషియా రూపాయలు (IDR). ఇది మార్చి 2022లో 22,000 ఇండోనేషియా రూపాయల(IDR)కు పెరిగింది. దేశంలో ఒక సంవత్సరంలో 57 శాతం వంట నూనె పెరిగింది. ఫిబ్రవరి 1న, ఇండోనేషియా ప్రభుత్వం రిటైల్ ధరలకు గరిష్ట పరిమితిని విధించింది.
ఈ కారణాల వల్ల ఇండేనేషియా ప్రభుత్వం ఎగుమతులపైనా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. పామాయిల్ ఎగుమతులను నిషేధించాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం భారత్ పై భారీగా ఉండనుంది. ఎందుకంటే.. దేశ వంటనూనె అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆదారపడ్డాయి. అందులోనూ.. ఇండోనేషియా నుంచి భారత్ ఎక్కువగా పామాయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. పామాయిల్ కొరత త్వరలోనే భారత్ పై పడనుందని నిపుణులు, మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని వల్ల సామాన్యులపై ధరల భారం పడనుందని తెలుస్తోంది.
ఇవీ చదవండి..
HUL Price Hike: సామాన్యులకు మరో షాక్.. సబ్బుల నుంచి డిటర్జెంట్ల వరకూ రేట్లు పెంచేసిన FMCG దిగ్గజం..