HUL Price Hike: సామాన్యులకు మరో షాక్.. సబ్బుల నుంచి డిటర్జెంట్ల వరకూ రేట్లు పెంచేసిన FMCG దిగ్గజం..

HUL Price Hike: ద్రవ్యోల్బణం పెరుగుధల, చమురు ధరల పెరుగుదల సామాన్యులకు కష్టాలను రోజురోజుకూ పెంచుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న ముడి పదార్ధాల రేట్ల వల్ల కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను పెంచుతున్నాయి. తాజాగా..

HUL Price Hike: సామాన్యులకు మరో షాక్.. సబ్బుల నుంచి డిటర్జెంట్ల వరకూ రేట్లు పెంచేసిన FMCG దిగ్గజం..
Hul Price Hike
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 15, 2022 | 6:28 PM

HUL Price Hike: ద్రవ్యోల్బణం పెరుగుధల, చమురు ధరల పెరుగుదల సామాన్యులకు కష్టాలను రోజురోజుకూ పెంచుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న ముడి పదార్ధాల రేట్ల వల్ల కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను పెంచుతున్నాయి. తాజాగా.. హిందుస్థాన్ యూనిలీవర్(Hindustan Unilever) సంస్థ ఏప్రిల్‌లో తన ఉత్పత్తుల ధరలను మరోసారి పెంచింది. FMCG మేజర్ స్కిన్ క్లెన్సింగ్, డిటర్జెంట్ల రేట్లను 3-20 శాతం ధరలను పెంచింది. దీనివల్ల డవ్, పియర్స్ వంటి సోప్ బార్‌ల రేట్లు భారీగా 20 శాతం వరకు పెరిగాయి. వీటికి తోడు ఎక్కువ మంది వాడే లైఫ్‌బాయ్ సబ్బు రేట్లలో కూడా పెరుగుదల కనిపించింది. ఇతర ఉత్పత్తులైన వీల్ డిటర్జెంట్ ప్యాక్ రేట్లు కూడా పెరిగాయి.

ముడిసరుకు ధరలు పెరుగుతూనే ఉన్నందున కంపెనీ తన పోర్ట్‌ఫోలియో అంతటా ధరలను పెంచుతోంది. లక్స్ తయారీదారు FY21 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం నుంచి ధరలను పెంచాలని అనుకుంటోంది. ఫిబ్రవరిలో కంపెనీ వివిధ ఉత్పత్తులపై ధరలను ఒకటి కంటే ఎక్కువ విడతలుగా పెంచింది. అధిక ముడిసరుకు ధరల ఒత్తిడిని తగ్గించేందుకు రేట్ల పెంపు 3-13 శాతం రేంజ్‌లో ఉంది. గత నెలలో కంపెనీ లక్స్, లైఫ్‌బాయ్, డవ్ షాంపూ, కిస్సాన్ జామ్, హార్లిక్స్, పెప్సోడెంట్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ బార్‌లతో సహా మరికొన్ని ఉత్పత్తుల ధరలను పెంచింది.

FY22 అక్టోబర్-డిసెంబర్ ఫలితాలను ప్రకటించిన తర్వాత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫైనాన్స్, IT రితేష్ తివారీ, ఒక కాన్ఫరెన్స్ కాల్‌లో పెట్టుబడిదారులతో మాట్లాడారు. నెట్ రెవెన్యూ మ్యానేజ్ మెంట్ ప్రాతిపధికన తాము ధరలను నిరంతరం పెంచుతూనే ఉంటామని చెప్పారు. కంపెనీకి రూ.1, రూ.5, రూ.10 ధరల్లో అందిస్తున్న ప్యాక్ ల నుంచి వస్తోందని తివారీ తెలిపారు. వీటిలో రేట్లను పెంచకుండా వస్తువుల బరువును తగ్గించాలని కంపెనీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల అదే సంఖ్యలో ఉత్పత్తులను అమ్మినప్పటికీ వాటి అమ్మకాలు వాల్యూమ్ తగ్గుతుందని అన్నారు.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ క్యాపిటల్ HULపై ప్రివ్యూ నివేదికలో గ్రామీణుల నుంచి డిమాండ్ మందగమనం, ధరల పెరుగుదల కారణంగా అమ్మకాలు తగ్గుతాయని వెల్లడించింది. HUL విక్రయాల వృద్ధి 10 శాతం వరుకూ అండవచ్చని ఆశిస్తున్నట్లు కంపెనీకి సంబంధించిన ప్రివ్యూలో ఎంకే సంస్థ పేర్కొంది. కానీ ఇది ఉత్పత్తుల ధరలపై ఆదారపడి ఉంటుందని వెల్లడించింది.

పెరిగిన ధరల వివరాలు..

  1. 4 లైఫ్ బాయ్ సోపు ప్యాకెట్ల ధర రూ.124 నుంచి రూ.136కు పెంపు
  2. 500 గ్రాముల వీల్ డిటర్జెంట్.. రూ.32 నుంచి రూ.33కు పెంపు
  3. కేజీ వీల్ డిటర్జెంట్.. రూ.63 నుంచి రూ.65కు పెంపు
  4. 25 గ్రాముల డవ్ సోపు.. రూ.12కు పెంపు
  5. 25 గ్రాముల పియర్ సోపు.. రూ.12కు పెంపు
  6. విమ్ లిక్విడ్ ధర రూ.99 నుంచి రూ.104కు పెరిగింది

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Elon Mask: ట్విట్టర్ కొనుగోలుకు కొత్త అడ్డంకి.. ఎలాన్ మస్క్ అలా చేయాలంటూ సూచనలు..

Mutual Funds: మనీ మార్కెట్‌ మ్యూచువల్ ఫండ్‌ ఉపయోగాలు ఏమిటో తెలుసుకోండి..