Elon Mask: ట్విట్టర్ కొనుగోలుకు కొత్త అడ్డంకి.. ఎలాన్ మస్క్ అలా చేయాలంటూ సూచనలు..

Elon Mask: ట్విటర్‌ కంపెనీలో ఎలాన్‌ మస్క్‌ 9.2 శాతం వాటా కొని అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. లాభపేక్షతో సంబంధం లేకుండా ట్విటర్‌(Twitter) కంపెనీకి చెందిన ఒక్కో షేర్‌ను 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని ఆయన ఆఫర్ చేశారు.

Elon Mask: ట్విట్టర్ కొనుగోలుకు కొత్త అడ్డంకి.. ఎలాన్ మస్క్ అలా చేయాలంటూ సూచనలు..
Elon Musk
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 15, 2022 | 4:46 PM

Elon Mask: ట్విటర్‌ కంపెనీలో ఎలాన్‌ మస్క్‌ 9.2 శాతం వాటా కొని అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. లాభపేక్షతో సంబంధం లేకుండా ట్విటర్‌(Twitter) కంపెనీకి చెందిన ఒక్కో షేర్‌ను 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని ఆయన ఆఫర్ చేశారు. ఇందుకోసం 43 బిలియన్‌ డాలర్లు (రూ.3.22లక్షల కోట్లు) చెల్లిస్తానని వెల్లడించారు. కానీ మస్క్‌ ఆఫర్‌ను ట్విట్టర్ యాజమాన్యం తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు.. మస్క్ దూకుడుకు కళ్లెం వేసేలా ట్విట్టర్ కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తమ కంపెనీలో మరిన్ని వాటాలను టెస్లా సీఈవో(Tesla CEO) కొనకుండా చూడాలని యోచిస్తోంది. తాజాగా.. ట్విట్టర్ కంపనీ షేర్ల విషయంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. అమెరికాకు చెందిన దిగ్గజ పెట్టుబడి సంస్థ Vanguard group ట్విట్టర్ కంపెనీలో తన వాటాలను 10.30 శాతానికి పెంచుకుంది. దీని కారణంగా ఎలాన్ మస్క్ తన అతిపెద్ద వాటాదారు హోదాను కోల్పోయారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సంస్థ వద్ద ట్విట్టర్ కంపెనీకి చెందిన 82.4 మిలియన్ షేర్లు ఉన్నాయి. వీటి విలువ 3.78 బిలియన్ డాలర్లుగా ఉంది.

కానీ.. ఎలాగైనా ట్వీటర్‌ను దక్కించుకునేందుకు ‘ప‍్లాన్‌-బి’ని అమలు చేస్తానని కెనడాలోని వాంకోవా నగరంలో జరిగిన టెడ్‌-2020 సమావేశంలో ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హాస్టైల్‌ టేకోవర్‌’తో ట్విట్టర్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే ఆ సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టెర్‌తో సంబంధం లేకుండా షేర్‌ హోల్డర్స్‌ను ఒప్పించి ట్విట్టర్‌ను చేజిక్కించుకునే అవకాశం ఉంది. దీనిని ఎలాన్‌ ప్లాన్‌-బి’ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌కు ఇచ్చిన ఆఫర్‌పై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. కానీ మరోపక్క కొందరు యూజర్లు మాత్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను గట్టెంకించేందుకు ఈ సొమ్మును వినియోగించవచ్చు కథా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

స్నాప్‌ డీల్‌ సీఈఓ కునాల్‌ బాల్‌..ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌కు 43 బిలియన్‌ డాలర్లను ఆఫర్‌ చేశారు. అదేదో  45 బిలయన్‌ డాలర్లతో శ్రీలంకను కొనుగోలు చేసి తాను సైక్లోన్‌ మస్క్‌గా పిలిపించుకోవచ్చు కదా అంటూ ఓ స్మైల్‌ మీమ్‌ను యాడ్‌ చేశారు.

మరో ట్విట్టర్‌ యూజర్‌ శ్రేయాసీ గోయెంకా..43 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మరో 8 బిలియన్‌ డాలర్లు దానికి కలిపి శ్రీలంకను అప్పుల్లో నుంచి బయపడేసి సైక‍్లోన్‌ మస్క్‌గా పేరు మార్చుకోవచ్చు కదా అంటూ ట్వీట్‌లో పేర్కొంది. ఇలా ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుకు చేసిన ఆఫర్ కాస్తా ఇప్పుడు శ్రీలంక కొనుగోలు చేయాలంటూ సూచనలు వస్తున్నాయి. వీటికి నెటిజన్ల నుంచి విపరీతమైన కామెంట్లు కూడా వస్తున్నాయి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

FD Interest Rates Hike: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేట్లు పెంచిన దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్..

TCS Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు.. వెంటనే రిజిస్ట్రర్ చేసుకోండి..

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!