FD Interest Rates Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేట్లు పెంచిన దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్..
ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ(ICICI) బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న వారికి శుభవార్త అదించింది ఆ బ్యాంక్. ఈ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను(Interest Rates) పెంచింది...
ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ(ICICI) బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న వారికి శుభవార్త అదించింది ఆ బ్యాంక్. ఈ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను(Interest Rates) పెంచింది. రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఎఫ్‌డీలపై బ్యాంక్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు ఏప్రిల్ 14, 2022 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDల రేట్లను పెంచింది. ఇంతకుముందు, 1 సంవత్సరంలో 15 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ 4.15 శాతంగా ఉంది, కానీ ఇప్పుడు ఈ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 4.25 శాతానికి చేరుకుంటుంది.
మొదటి 15 నెలల నుంచి 18 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీల వడ్డీ రేటు 4.20 శాతం ఉండగా, ఇప్పుడు అది 4.30 శాతానికి పెరిగింది. ఇది కాకుండా, 18 నెలల నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన FDల వడ్డీ రేటు 4.30 శాతంగా ఉంది. ఇది ఇప్పుడు 4.40 శాతానికి పెరుగుతుంది. ఐసీఐసీఐ బ్యాంకులో 2 సంవత్సరాలు ఒకరోజు, 3 సంవత్సరాలు FD చేసిన వారికి గతంలో 4.50 శాతం వడ్డీ లభించేది, ఇప్పుడు వారికి 4.60 శాతం వడ్డీ లభించనుంది. అదే సమయంలో ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 4.70 శాతం వడ్డీని అందించనున్నారు. ఇది అంతకు ముందు 4.60 శాతంగా ఉండేది.
రూ. 2 కోట్లు, అంతకంటే ఎక్కువ అయితే రూ. 5 కోట్ల కంటే తక్కువ ఉన్నవారు 7 నుంచి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 2.5 శాతం వడ్డీని పొందుతారు. 61 రోజుల నుండి 90 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు ఇప్పుడు 3 శాతం కాగా, 30 రోజుల నుంచి 60 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై బ్యాంక్ 2.75 శాతం వడ్డీని ఇస్తుంది. ప్రస్తుతం, ICICI బ్యాంక్ 91 రోజుల నుంచి 184 రోజుల మెచ్యూరిటీ ఉన్న FDలపై 3.35 శాతం వడ్డీని అందిస్తోంది. వారం క్రితం, ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ్యవధిని పొడిగించిన విషయం తెలిసిందే.. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక FD పథకం అమలు చేస్తున్నారు. దీనిలో సాధారణ డిపాజిటర్ల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తారు.
Read Also.. IMF: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ఐఎంఎఫ్ ఆందోళన.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందంటూ హెచ్చరిక..