Mutual Funds: మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ ఉపయోగాలు ఏమిటో తెలుసుకోండి..
Mutual Funds: చాలా మంది వ్యాపార వేత్తలు నగదు రూపంలోనే చెల్లింపులు చేస్తుంటారు. రోజూ వారికి ఖర్చుల తరువాత చాలా డబ్బు ఆదాయంగా వస్తుంటుంది. ఈ మెుత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే మంచి రాబడి లభిస్తుంది.
Mutual Funds: జనార్ధన్ హైదరాబాద్ లో వ్యాపారం చేస్తుంటాడు. అతను చాలా వరకు నగదు రూపంలోనే లావాదేవీలు చేస్తుంటాడు. రోజువారీ ఖర్చుల తర్వాత కూడా అతనికి పెద్ద మొత్తంలో డబ్బు మిగులుతుంది. జనార్ధన్ ఆ డబ్బును కరెంట్(Current Account) లేదా సేవింగ్స్ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తు్న్నాడు. చాలా సందర్భాల్లో నెలల తరబడి డబ్బును అకౌంట్లలో ఉంచాల్సి వస్తుంది. అతను ఒక వ్యాపారవేత్తగా డబ్బు నుంచి డబ్బు సంపాదించడం చేయలేకపోతున్నాడు. తన డబ్బు రెండు మూడు నెలలు బ్యాంకులో ఉంచడం అతనికి నచ్చడం లేదు. ఈ విషయంలో ఏమి చేస్తే తన డబ్బు నుంచి ఆదాయాన్ని తీసుకోవచ్చు అనే విషయం తెలియక సతమతం అవుతున్నాడు. మరి ఇలాంతపుడు జనార్ధన్ లాంటి వారు ఏం చేయాలి? అతను స్వల్పకాలంలో(Short Term Investment) పెట్టుబడి పెట్టి కొంత ప్రాఫిట్ పొందే అవకాశం ఉందా? ఇలా ఇన్వెస్ట్ చేసినా ఎప్పుడైనా వ్యాపారానికి అవసరం అయితే వెంటనే విత్ డ్రా చేసుకునే అవకాశమూ ఇటువంటి వారికి ఉండాలి. ఇలాంటి వారికి మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా మంచి రాబడిని అందిస్తాయో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Multibagger Stock: ఐదేళ్లలో 9300 శాతం రాబడిని అందించిన షేర్.. మీరూ పెట్టుబడి పెట్టారా..
Fraction Shares: చిన్న పెట్టుబడిదారులకు శుభవార్త.. ఇకపై ఖరీదైన షేర్లను సులువుగా కొనవచ్చు..