Multibagger Stock: ఐదేళ్లలో 9300 శాతం రాబడిని అందించిన షేర్.. మీరూ పెట్టుబడి పెట్టారా..
Multibagger Stock: కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తుంటాయి. రూపాయుల్లో పెట్టుబడి పెడిన వారికి వందల్లో రిటర్న్స్ ఇస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ షేర్ కూడా.
Multibagger Stock: కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తుంటాయి. రూపాయుల్లో పెట్టుబడి పెడిన వారికి వందల్లో రిటర్న్స్ ఇస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ షేర్ కూడా. రైస్ మిల్లింగ్ వ్యాపారంలో ఉన్న GRM Overseas కంపెనీ షేర్లు ఐదేళ్ల కాలంలో మంచి రాబడిని అందిచాయి. 5 ఏళ్ల కాలంలో 9300 శాతం రాబడిని అందిచాయి. రూ. 6 వద్ద ఉన్న ఈ షేర్ విలువ ప్రస్తుతం రూ.565 కు చేరింది. గడచిన ఆరు నెలల కాలంలో షేర్ రూ.210 నుంచి రూ.565కు పెరిగింది. అంటే ఈ కాలంలో అది 170 శాతం మేర పెరిగింది. అదే సంవత్సర కాలాన్ని పరిశీలిస్తే.. షేర్ రూ.125 నుంచి రూ.565కు చేరుకుంది.
అంటే ఏడాది కాలంలో 345శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఒక సంవత్సరం క్రితం ఈ షేర్ లో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే దాని విలువ ప్రస్తుతం రూ.4.45 లక్షలుగా ఉండేది. గడచిన 52 వారాల వివరాలను పరిశీలిస్తే షేర్ తన జీవితకాల గరిష్ఠమైన రూ.935ను జనవరిలో 2022లో చేరుకుంది. అదే విధంగా ఏప్రిల్ 2021లో కనిష్ఠమైన రూ.113ను తాకింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.783 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.779 కోట్లు గడించింది.
NOTE: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఇవీ చదవండి..
Fraction Shares: చిన్న పెట్టుబడిదారులకు శుభవార్త.. ఇకపై ఖరీదైన షేర్లను సులువుగా కొనవచ్చు..