Railway News: రైల్వే ప్రయాణికులకి శుభవార్త.. దక్షిణ రైల్వే మధ్యలో నడిచే రైళ్లకి అదనపు కోచ్‌ల ఏర్పాటు..

Railway News: ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో, టిక్కెట్ల కోసం పెరిగిన డిమాండ్ కారణంగా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే ఏర్పాట్లు చేస్తుంది.

Railway News: రైల్వే ప్రయాణికులకి శుభవార్త.. దక్షిణ రైల్వే మధ్యలో నడిచే రైళ్లకి అదనపు కోచ్‌ల ఏర్పాటు..
South Central Railway
Follow us

|

Updated on: Apr 15, 2022 | 2:07 PM

Railway News: ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో, టిక్కెట్ల కోసం పెరిగిన డిమాండ్ కారణంగా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ముఖ్యమైన మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో అదనపు రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులని గమనించిన రైల్వే అధికారులు కొన్ని రైళ్లకి అదనపు కోచ్‌లను అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రైళ్ల సమాచారం గురించి తెలుసుకుందాం.

ట్రైన్‌ నెంబర్ 22867: ఏప్రిల్ 17న హౌరా, ఢిల్లీ మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 12889: ఏప్రిల్ 15న టాటానగర్, యశ్వంతపూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 18045: ఏప్రిల్ 15 నుంచి 18 వరకు షాలిమార్, హైద్రాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 18189: ఏప్రిల్ 17న టాటానగర్, ఎర్నాకులం మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 18637: ఏప్రిల్ 16న హతియా, బెంగుళూరు మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా ఒక స్లీపర్ క్లాస్, ఒక త్రి టైర్ ఏసీ-1 కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 20889: ఏప్రిల్ 16న హౌరా, తిరుపతి మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా త్రి టైర్ ఏసీ-1 కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 22807: ఏప్రిల్ 15న సంత్రాగాచి, చెన్నై సెంట్రల్‌ మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా త్రి టైర్ ఏసీ-1 కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 22837: ఏప్రిల్ 18న హతియా, ఎర్నాకులం మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా త్రి టైర్ ఏసీ-1 కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 22855: ఏప్రిల్ 17న సంత్రాగాచి, తిరుపతి మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా త్రి టైర్ ఏసీ-1 కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 22863: ఏప్రిల్ 18న హౌరా, యశ్వంత్‌ పూర్‌ మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా త్రి టైర్ ఏసీ-1 కోచ్‌ని ఏర్పాటు చేశారు.

ట్రైన్‌ నెంబర్ 22877: ఏప్రిల్ 16న హౌరా, ఎర్నాకులం మధ్య నడిచే ప్యాసింజర్ రైలుకి అదనంగా స్లీపర్ క్లాస్ కోచ్‌ని ఏర్పాటు చేశారు.

Health Tips: మూత్రం ఈ రంగులో వస్తే జాగ్రత్త.. అది కిడ్నీ ఫెయిల్యూర్‌ సంకేతం కావొచ్చు..!

Health Tips: వయసు ప్రభావం ముఖంపై కనిపించకూడదంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Health Tips: పరగడుపున ఈ పానీయాలు తాగండి.. బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోండి..!