AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMF: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై ఐఎంఎఫ్‌ ఆందోళన.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందంటూ హెచ్చరిక..

ఉక్రెయిన్‌పై యుద్ధం(Russia ukraine war) ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక అవకాశాలను బలహీనపరుస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గురువారం హెచ్చరించింది.

IMF: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై ఐఎంఎఫ్‌ ఆందోళన.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందంటూ హెచ్చరిక..
Imf
Srinivas Chekkilla
|

Updated on: Apr 15, 2022 | 7:00 AM

Share

ఉక్రెయిన్‌పై యుద్ధం(Russia ukraine war) ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక అవకాశాలను బలహీనపరుస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గురువారం హెచ్చరించింది. అధిక ద్రవ్యోల్బణం(Inflation) ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన ముప్పుగా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా 186 దేశాల ఆర్థిక పరిస్థితి క్షీణించిందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. యుద్ధం.. ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించిందన్నారు. ఆఫ్రికా, పశ్చిమాసియాలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. వాషింగ్టన్‌లో వచ్చే వారం IMF, ప్రపంచ బ్యాంకు సమావేశాల ముందు ఆయన ఈ విషయం చెప్పారు.

2020 మహమ్మారి వల్ల ఏర్పడిన మాంద్యం ఆర్థిక వ్యవస్థలలో ఊహించని విధంగా బలమైన రికవరీకి దారితీసిందని జార్జివా చెప్పారు. ప్రపంచ పునరుద్ధరణకు ద్రవ్యోల్బణం పెద్ద ఎదురుదెబ్బ అని ఆయన అన్నారు. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భౌగోళిక రాజకీయ విభాగాలుగా విభజించడం గురించి కూడా జార్జివా హెచ్చరించారు.

ఒకవైపు రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించడంతో పాటు అదే సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడికి చైనా మద్దతు ఇవ్వడం ఆందోళ కలిగిస్తుందని పేర్కొన్నాడు. అత్యంత పేదరికంలో జీవిస్తున్న వారి నిష్పత్తి ఒక శాతం కంటే తక్కువ స్థాయిలోనే ఉందని IMF పేర్కొంది. మహమ్మారి సమయంలో కూడా ఇది ఈ స్థాయిలో స్థిరంగా ఉంది.

Read Aslo.. Elon Musk: ట్విట్టర్‌ కంపెనీ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ప్రతిపాదన.. 41.39 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి..