Facebook: అమెజాన్‌ కంటే ఫేస్‌బుక్‌ ఖర్చు ఎక్కువ.. ఏ విషయంలో అంటే..

Meta(Facebook) CEO మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg), తనకు, తన కుటుంబ సభ్యుల భద్రత కోసం గత సంవత్సరం మొత్తం $27.8 మిలియన్లకు( రూ.204 కోట్లు) పైగా ఖర్చు చేశారు..

Facebook: అమెజాన్‌ కంటే ఫేస్‌బుక్‌ ఖర్చు ఎక్కువ.. ఏ విషయంలో అంటే..
Meta
Follow us

|

Updated on: Apr 15, 2022 | 7:38 PM

Meta(Facebook) CEO మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg), తనకు, తన కుటుంబ సభ్యుల భద్రత కోసం గత సంవత్సరం మొత్తం $27.8 మిలియన్లకు( రూ.204 కోట్లు) పైగా ఖర్చు చేశారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం మార్క్ జుకర్‌బర్గ్, అతని కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి మెటా రోజుకు దాదాపు రూ. 55 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇటీవలి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మార్క్ జుకర్‌బర్గ్ సెక్యూరిటీకి ఈ మొత్తం ఖర్చు చేసినట్లు తెలిపింది. కంపెనీ 2013 నుంచి మార్క్ జుకర్‌బర్గ్ భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2013 సంవత్సరంలో జుకర్‌బర్గ్ భద్రత కోసం దాదాపు రూ.25 కోట్లు ఖర్చు చేయగా, గతేడాది 8 రెట్లు పెరిగి రూ.204 కోట్లకు చేరుకుంది.

జుకర్‌బర్గ్ ఇంట్లో ఉండే సమయంలో, వ్యక్తిగత ప్రయాణాల సమయంలో అతని రక్షణకు కంపెనీ గత ఏడాది రూ.116 కోట్లు ఖర్చు చేసిందని నివేదిక పేర్కొంది. ఇది కాకుండా జుకర్‌బర్గ్ కుటుంబ భద్రత కోసం రూ.76 కోట్లు ఖర్చు చేయగా, యాత్రకు వినియోగించిన ప్రైవేట్ విమానం ఖరీదు రూ.12.2 కోట్లుగా వివరించింది. ఇదిమార్క్ జుకర్‌బర్గ్, అతని కుటుంబం కోసం 2021 సంవత్సరంలో 204 కోట్లు ఖర్చు చేశామని, 2020 సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం కంటే 6 శాతం ఎక్కువగా ఉందని మెటా పేర్కొంది.

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన జెఫ్ బెజోస్ సెక్యూరిటీ కోసం గతేడాది మొత్తం రూ.12.2 కోట్లు ఖర్చు చేశారు. అంటే మార్క్ జుకర్‌బర్గ్ సెక్యూరిటీకి ఖర్చు చేసిన డబ్బు కంటే 17 రెట్లు తక్కువ. గతేడాది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భద్రత కోసం రూ.33 కోట్లు వెచ్చించారు. ఇవి కాకుండా యాపిల్ సీఈవో టిమ్ కుక్ భద్రత కోసం కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే కంపెనీ ఖర్చు చేశారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్ భద్రత కోసం ఎంత డబ్బు వెచ్చిస్తున్నారనే సమాచారం మాత్రం దొరకలేదు. కొంత కాలం క్రితం మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్‌ కంపెనీ పేరును మెటాగా మార్చారు. మెటా కింద్ Facebook, WhatsApp, Instagram సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పని చేస్తున్నాయి.

Read Also.. FD Interest Rates Hike: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేట్లు పెంచిన దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్..

Latest Articles