Elon Musk: ఎలాన్‌ మస్క్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్విట్టర్‌ వాటాదారు.. చాలా తక్కువకు అడిగారంటూ ట్వీట్‌..

Twitterను మార్కెట్‌ రేటు కంటే అధిక ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) ప్రకటించిన విషయం తెలిసిందే...

Elon Musk: ఎలాన్‌ మస్క్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్విట్టర్‌ వాటాదారు.. చాలా తక్కువకు అడిగారంటూ ట్వీట్‌..
Elon Musk
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 15, 2022 | 6:06 PM

Twitterను మార్కెట్‌ రేటు కంటే అధిక ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మస్క్ ప్రతిపాదనను Twitter షేరుహోల్డర్ ఈ ఆఫర్‌ను చాలా తక్కువగా పరిగణిస్తున్నారు. సౌదీ రాజకుటుంబ సభ్యుడు, ప్రధాన ట్విటర్ పెట్టుబడిదారు అల్ వలీద్ బిన్ తలాల్ అల్(Al valid bin thalal Al) సౌద్ మాట్లాడుతూ.. ట్విట్టర్ వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే మస్క్ ఆఫర్ చాలా తక్కువ అని అన్నారు. మస్క్ ట్విట్టర్‌ను $43 బిలియన్లకు చేయడానికి ప్రతిపాదన చేశాడు. ఈ ప్రతిపాదన సమయంలో ట్విటర్ షేర్ ధర కంటే మస్క్ ఒక్కో షేరుకు 30 శాతం ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాని ప్రకటించాడు. ఈ ధరకు కూడా కంపెనీని నియంత్రించడానికి అవసరమైన షేర్లను పొందడం చాలా కష్టమని అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ చెప్పారు.

ట్విట్టర్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్ వాస్తవ ధరకు దూరంగా ఉందన్నారు. Twitterలో పెద్దష దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా తను ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ మస్క్ ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడానికి $ 43 బిలియన్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 4న మస్క్ ట్విట్టర్‌లో 9 శాతం వాటాను తీసుకున్నారు. ఆ తర్వాత అతను వాటాను పెంచుకునే ప్రతిపాదన చేశాడు. ట్విటర్‌ లక్ష్యం నెరవేరేందుకు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అదే సమయంలో తన ఆఫర్ అంగీకరించకపోతే.. అతను తన వాటాదారు హోదాను సమీక్షిస్తానని కూడా చెప్పాడు.

ఒక నివేదిక ప్రకారం.. మస్క్ $ 43 బిలియన్ల నగదు ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులభం కాదు. 43 బిలియన్ డాలర్లు అంటే.. అతని సంపదలో ఆరవ వంతు కావచ్చు, కానీ ప్రత్యేక విషయం ఏమిటంటే బిలియనీర్ల సంపదలో ఎక్కువ భాగం వారి కంపెనీలలో వాటాల్లో ఉంటుంది. మస్క్ ఈ నగదు ఒప్పందాన్ని పూర్తి చేయడానికి పెద్ద వాటాను విక్రయించాలి లేదా రుణాన్ని తీసుకోవాలి. మస్క్ తన వద్ద ఉన్న $3 బిలియన్ల నగదుతో పాటు టెస్లా ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించాలనుకుంటే, అతను టెస్లాలో తన వాటాలో ఐదో వంతును విక్రయించాల్సి ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది.

Read Also.. Facebook: మార్క్ జుకర్‌బర్గ్‌ భద్రతకు రూ.116 కోట్లు ఖర్చు.. జెఫ్ బెజోస్ కంటే 12 రేట్లు ఎక్కువ..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?