Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. పెండింగ్‌ చలాన్ల డిస్కౌంట్‌కు ఇంకా కొన్ని గంటలే..

Hyderabad: పెండింగ్‌లో ఉన్న చలాన్ల క్లియరెన్స్‌కు తెలంగాణలో ఆఫర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్‌లో భాగంగా చలాన్లలో కేవలం 25 శాతం చెల్లిస్తే 75 శాతం మాఫీ చేశారు. ఇదిలా ఉంటే మార్చి 1న ప్రారంభమైన ఈ ఆఫర్‌..

Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. పెండింగ్‌ చలాన్ల డిస్కౌంట్‌కు ఇంకా కొన్ని గంటలే..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 15, 2022 | 4:24 PM

Hyderabad: పెండింగ్‌లో ఉన్న చలాన్ల క్లియరెన్స్‌కు తెలంగాణలో ఆఫర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్‌లో భాగంగా చలాన్లలో కేవలం 25 శాతం చెల్లిస్తే 75 శాతం మాఫీ చేశారు. ఇదిలా ఉంటే మార్చి 1న ప్రారంభమైన ఈ ఆఫర్‌ మార్చి 31కి ముగియనున్నట్లు మొదట్లో అధికారులు ప్రకటించారు. అయితే వాహనదారుల విజ్ఞప్తి మేరకు ఆ గడువును ఏప్రిల్‌ 15 వరకు పొడగించారు. ఈ లెక్కన్న మరికొన్ని గంటల్లో ఆఫర్ ముగియనుందన్నమాట. ఈ నేపథ్యంలోనే వాహనాదురులు ఇంకా ఎవరైనా చలాన్లు చెల్లించని వారుంటే వెంటనే చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 2.8 కోట్ల చల్లనాలు క్లియర్ అయ్యాయని అధికారులు తెలిపారు. రాత్రి 12 గంటల లోపు మరో 20 వేల క్లియర్‌ కావొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం 3 కోట్ల చలాన్లు క్లియర్‌ అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలో మొత్తం 5 కోట్ల చెల్లాన్ల పెండింగ్ వాటి మొత్తం విలువ రూ. వెయ్యి కోట్లుగా ఉంది. పెండింగ్ చలాన్ల రూపంలో ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.300 కోట్ల ఆదాయం దక్కింది.

మొత్తం పెండింగ్‌ చలాన్లలో 65 నుంచి 70 శాతం పైగా క్లియర్ కానున్నాయి. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే కోటి 70 లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. నేటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి ఆఫర్‌ను ఎట్టి పరిస్థితుల్లో పొడగించేది లేదని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత పెండింగ్ చెల్లాన్ల పై ఛార్జ్‌ చీట్‌ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Summer Drink: చాయ్ ప్రియుల కోసం..వేసవిలో హైడ్రేట్‌గా మార్చే ‘సమ్మర్ కూల్ టీ’.. ఎలా తయారు చేయాలో తెలుసా..

Viral Video: రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన లారీ.. బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి

Maruti Suzuki Ertiga 2022: మారుతి సుజుకి నుంచి మరో కొత్త ఎర్టిగా కారు.. ధర, ఫీచర్స్‌ వివరాలు!