AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: వరి పంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని ప్రయత్నించారు.. బీజేపీపై కేటీఆర్ ఫైర్

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) చేస్తున్నది పాదయాత్ర కాదని.. అది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) విమర్శించారు. కరవుకాటకాల నుంచి ఇప్పుడిప్పుడే....

KTR: వరి పంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని ప్రయత్నించారు.. బీజేపీపై కేటీఆర్ ఫైర్
Ktr
Ganesh Mudavath
|

Updated on: Apr 15, 2022 | 1:52 PM

Share

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) చేస్తున్నది పాదయాత్ర కాదని.. అది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) విమర్శించారు. కరవుకాటకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి, హరితమయంగా మారుతున్న ఉమ్మడి మహబాబ్ నగర్ జిల్లా (Mahabub Nagar District) పై బండి సంజయ్ పగబట్టారని ఆరోపించారు. అందుకే అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారన్నారు. పాలమూరుకు బీజేపీ చేసిన ద్రోహం, ప్రాజెక్టుల మంజూరులో చూపిన నిర్లక్ష్యం, నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం చేసిన వంచనకు పాలమూరు ప్రజానీకానికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్ధాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తూ, ఎగతాళి చేస్తున్న నియంతృత్వ పోకడలపై క్షమాపణ చెప్పి పాదయాత్రను ప్రారంభిస్తే గౌరవం దక్కుతుందని సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి పాల్పడుతూ పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని చేసిన విజ్ఞప్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాధానం ఏంటో చెప్పాలన్నారు. కర్ణాటకపై కనికరం చూపి, పక్కనే ఉన్న పాలమూరుపై ఎందుకు కక్ష పెంచుకున్నామని ప్రశ్నించారు.

ఆదిశక్తి పీఠమైన జోగులాంబను దర్శించుకుని పాదయాత్ర ప్రారంభిస్తున్న బండి సంజయ్.. రాష్ట్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలకు ఎన్ని నిధులను తీసుకొచ్చారో చెప్పాలి. రాముడు నడయాడిన భద్రాద్రికి ఏం చేశారో సమాధానం చెప్పాలి. అంకుఠిత దీక్షతో అద్భుతమైన దైవక్షేత్రంగా యాదాద్రిని నిర్మించాం. ఈ దైవ కార్యంలో బీజేపీ భాగస్వామ్యం ఏమన్నా ఉందా?. రైతులనూ బీజేపీ రాజకీయాలకు ఉపయోగించుకుంటోంది. వడ్లు వేస్తే కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తామని తప్పుదోవ పట్టించి, పంట చేతికొచ్చాక తప్పించుకు తిరుగుతున్నారు. బండి సంజయ్ తన పాదయాత్రకు రైతు దగా యాత్ర లేక రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది.

          – కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ మంత్రి

వరి పంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఇబ్బందులకు గురిచేశారని కేటీఆర్ ఆక్షేపించారు. వడ్లు కొనమని అడిగితే నూకలు తినండని తెలంగాణ ప్రజల్ని అవమానించిన దురహంకారం భారతీయ జనతా పార్టీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న బండి సంజయ్ కు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదని విమర్శించారు. బీజేపీ పాలనా విధానాలతో దేశంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణకు అడుగడుగునా బీజేపీ అన్యాయమే చేసిందన్న కేటీఆర్.. తెలంగాణ నుంచి ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రాలో కలిపేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విభజన హామీలను బీజేపీ ఇంకా నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ చెప్పినా నిధులివ్వలేదన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హూదా ఇవ్వకుండా, నదీ జలాల్లో వాటాలు తేల్చకుండా జల దోపిడీకి పాల్పడుతున్నారని ఆక్షేపించారు.

Also Read

suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..

Simbu: ఆటో డ్రైవర్‏గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..

PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు.. 

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు