AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన లారీ.. బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి

ప్రమాదాలు(Accident) ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటి వారు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం తప్పదు. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు, రోడ్డు...

Viral Video: రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన లారీ.. బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి
Accident
Ganesh Mudavath
|

Updated on: Apr 15, 2022 | 11:59 AM

Share

ప్రమాదాలు(Accident) ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటి వారు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం తప్పదు. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు, రోడ్డు దాటుతున్నప్పుడు ముందూ వెనుకా చూసుకోవాలి. లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వారినే నమ్ముకున్న కుటుంబసభ్యులు రోడ్డున పడతారు. తాజాగా జరిగిన ఓ ఘటన గగుర్పాటుకు గురి చేస్తోంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిని లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాదం దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. తూర్పుగోదావరి(East Godavari District) జిల్లాలోని రాజానగరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబం ఇంటిపెద్దను కోల్పోయింది. శ్రీరామపురం ప్రాంతానికి చెందిన మాదారపు వెంకటేశ్వరరావు.. ద్విచక్రవాహనంపై దివాన్ చెరువు కూడలి నుంచి పాలచర్ల వైపు వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న సమయంలో రాజానగరం వైపు నుంచి వస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. అంతేకాకుండా కొంతదూరం ఈడ్చుకుంటూ పోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం గమనార్హం. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ వెళ్లే భారీ వాహనాలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి. హైవే కి ఆనుకుని ఉన్న మారుమూల గ్రామాల నుండి పొలం పనులకు ఇతర గ్రామాలకు ఈ హైవే మీద ఉండే వెళుతుంటారు.. కానీ అక్కడ సిగ్నల్ కూడా పనిచేయడంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

Also Read

IPL 2022: హార్దిక్ పాండ్యాకు లక్ష రూపాయల నష్టం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

Watch Video: ప్లీజ్.. మీ కాళ్లు మొక్కనివ్వండన్న జాంటీ రోడ్స్.. వద్దని వారించిన సచిన్.. వైరల్ వీడియో