Deer Poaching Case: కృష్ణ జింకల వేట కేసులో సంచలనాలు.. పోలీసుల అదుపులో హంటర్‌ అయూబ్‌ ఖాన్‌..

Krishna Deer Poaching Case: కర్నూలు జిల్లా జింకల వేట కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో అయూబ్‌ఖాన్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చారు పోలీసులు. అయూబ్‌ ఖాన్‌కు.. హంటర్‌, డాన్‌, కరుడుగట్టిన స్మగ్లర్‌..

Deer Poaching Case: కృష్ణ జింకల వేట కేసులో సంచలనాలు.. పోలీసుల అదుపులో హంటర్‌ అయూబ్‌ ఖాన్‌..
Krishna Deer
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 15, 2022 | 11:32 AM

కర్నూలు జిల్లా(Kurnool district) జింకల వేట కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో అయూబ్‌ఖాన్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చారు పోలీసులు. అయూబ్‌ ఖాన్‌కు.. హంటర్‌, డాన్‌, కరుడుగట్టిన స్మగ్లర్‌ ఇలా ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. ఇప్పటికే పలు కేసులో నిందితుడిగా ఉన్న ఖాన్‌.. ఇప్పుడు మరో సారి కృష్ణ జింకల(krishna deer) కేసులో పట్టుబడ్డాడు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ జింకల వేట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న ఫారెస్ట్‌ అధికారులు.. అయూబ్‌ఖాన్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. గట్టి బందోబస్తు మధ్య హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి కర్నూలు కోర్టులో హాజరుపర్చయారు. ఆదోని తాలుకా నారాయణపురం-కమ్మరిచేడు గ్రామాల సరిహద్దులో 11 కృష్ణ జింకలను చంపిన కేసులో.. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన అయూబ్‌ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డి, డీఎఫ్‌వో సుమన్‌బెన్‌పల్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి 6వ తేదీన జింకలను వేటాడి చంపిన ఘటనపై అటవీశాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు పోలీసు, అటవీశాఖ అధికారులు, సిబ్బందితో స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు.

మార్చి 5వ తేదీన హైదరాబాదు నుంచి ఐదుగురు సభ్యుల ముఠా తుపాకులు, కమాండర్‌ జీపు, ఇన్నోవా కారులో ఆదోని వచ్చి హోటల్‌లో బసచేసిందని చెప్పారు. వారు 6వ తేదీ తెల్లవారుజామున రెండు వాహనాల్లో నారాయణపురం, కమ్మరివేడు సరిహద్దుల్లో వ్యవసాయ పొలాల్లో రెక్కీ నిర్వహించి.. తుపాకులతో 11 కృష్ణ జింకలను చంపారు. ఆ తర్వాత వాటి తలలను వేరుచేసి చర్మాలు, మాంసాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఐదుగురిలో ఒకరైన అయూబ్‌ఖాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్‌కు ప్రత్యేక టీమ్‌ వెళ్లి అరెస్టు చేసింది. అతని నుంచి తుపాకీ స్వాధీనం చేసుకుని ఆలూరు కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

అయూబ్‌ఖాన్‌ పేరు చెప్పగానే చిన్న పాటి అండర్‌ డాన్‌. కొన్నాళ్లుగా ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆలూరు ప్రాంతంలో కృష్ణ జింకలు ఎక్కువగా ఉండడంతో.. ఈ ముఠా కన్ను పడింది. కొంత కాలం దుబాయిలో ఉన్న అయూబ్‌.. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఎకరం విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంటి చుట్టూ తుపాకులతో తిరిగే గన్‌మెన్‌ల ముఠా ఉంటుంది. ఇతనికి జింకలను వేటాడి.. ఆ మాంసం తినడం మహా సరదా.. అంతకటే.. జల్సా కూడా.

తన ముఠాను వెంట పెట్టుకొని.. మార్చి 5న కర్నూలులో ల్యాండ్‌ అయ్యాడు. 5న రాత్రి ఆదోనిలో ఓ లాడ్జిలో బస చేశారు. 6వ తేదీ ఉదయం జింకల వేటకు తుపాకులతో బయలుదేరారు. నారాయణపురం కమ్మరచేడు గ్రామాల్లో జింకలను వేటాడారు. వీరి తూటాలకు 11 మగ కృష్ణజింకలు బలయ్యాయి. కొన ఊపిరితో ఉండగానే జింకల తల, కాళ్ల,కొమ్ములు వేరు చేసి.. మాంసాన్ని మాత్రం హైదరాబాద్ తీసుకెళ్లి జల్సా చేశారు. ఈ కేసులో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించడంతో ఈ బండారం బయట పడింది.

ఇక ఈ ముఠా డాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులే తంటాలు పడాల్సి వచ్చింది. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన స్పెషల్‌ టీమ్‌.. నాంపల్లిలోని అయూబ్‌ఖాన్‌ ఇంటి చుట్టు ఉన్న ఆరేంజ్‌మెంట్స్‌ను చూసి షాక్‌ తిన్నారు. భయంతో వెనక్కు వెళ్లిన పోలీసులు.. భారీ బందోబస్తుతో వచ్చి బలవంతంగా అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పర్చారు.

ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..

JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!

బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..