Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Theatre: ఏపీలో మొదటి మొబైల్ సినిమా థియేటర్.. ఎక్కడో తెలుసా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న రీతిలో మొదటిసారిగా మొబైల్ సినిమా థియేటర్‏ను ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాలోని రాజానగరం వద్ద

Mobile Theatre: ఏపీలో మొదటి మొబైల్ సినిమా థియేటర్.. ఎక్కడో తెలుసా..
Theatre
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 15, 2022 | 11:12 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న రీతిలో మొదటిసారిగా మొబైల్ సినిమా థియేటర్‏ను ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాలోని రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్‏ను ఏర్పాటుచేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్‏లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ థియేటర్‏ను రూపొందిస్తున్నారు. “పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఆంధ్రప్రదేశ్‏లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిదని నిర్వాకులు తెలిపారు. ఢిల్లీకి చెందిన పిక్చర్ టైం డిజిటల్స్ సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో గతంలో RRR మూవీ కి మొదలు కావాల్సి ఉంది…కొన్ని పర్మిషన్ల దృష్ట్యా..దీనిని మొదటి సారిగా మెగాస్టార్ ఆచార్య సినిమాతో ధియేటర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు..ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపమని తెలిపారు. అలాగే.. దీనిని ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ అని తెలిపారు. ఈ మొబైల్ థియేటర్ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలో మరిన్ని చోట్ల ఇలాంటి థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మొబైల్ ఎయిర్ బెలూన్ థియేటర్ లో 120 సిటీతో పాటు 5.1 surround sound system ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు… మల్టీప్లెక్స్ థియేటర్ లో ఏ విధంగా వాష్ రూమ్స్ , ఏసి తో పాటు.. లేటెస్ట్ టెక్నాలజీ ని వాడుతూ దీనికి కేవలం ఐదు నుంచి ఏడు రోజుల్లో పూర్తి చేశారు…. సాధారణంగా ఇలాంటి మొబైల్ ఎయిర్ థియేటర్లను కొండ ప్రాంతాల్లో లో ఏర్పాటు చేసి… ముఖ్యమైన హీరోల మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ను ఇలాంటి వాటిలో మారుమూల గ్రామస్తులకు చూపిస్తారు….. అలాంటి మొబైల్ ఎయిర్ బెలూన్ రూమ్ థియేటర్ ఇప్పుడు రాజానగరం లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుందని తెలిపారు.

Film

Film

తెలుగు రాష్ట్రాల్లో ఆధునిక టెక్నాలజీతో అప్పటికప్పుడు థియేటర్‏ను నిర్మించుకునే స్కోప్ సాధ్యమవుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణలోని కొమురం జిల్లా ఆసిఫాబాద్‏లోని జన్కాపురంలో పిక్చర్ ట్యూబ్ సంస్థ బెలూన్ థియేటర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన పిక్చర్ టైం అంకుర సంస్థ అధునాత సాంకేతిక బెలూర్ పరిజ్ఞానంతో దాదాపు 120 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో రూపొందించారు. ఎంత గాలి వీచిన చెక్కు చెదరకుండా ఉండేలా ఏసీ, సౌండ్ సిస్టమ్‏తో మల్టీప్లెక్స్‏ను తలపించేలా దానిని నిర్మిస్తుంచారు. ప్రస్తుతం అందులో జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఈ థియేటర్‏ను డైరెక్టర్ రాజమౌళి సందర్శించిన సంగతి తెలిసిందే.

Also Read: suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..

Simbu: ఆటో డ్రైవర్‏గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..

PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు.. 

Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్‏కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..