AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్‏కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..

సాధారణంగా హీరోహీరోయిన్స్ పై విపరీతమైన అభిమానంతో ఉంటారు కొందరు. తమకు ఇష్టమైన నటీనటులకు సంబంధించిన ప్రతిచిన్న

Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్‏కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..
Sunny Leone
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 15, 2022 | 10:56 AM

సాధారణంగా హీరోహీరోయిన్స్ పై విపరీతమైన అభిమానంతో ఉంటారు కొందరు. తమకు ఇష్టమైన నటీనటులకు సంబంధించిన ప్రతిచిన్న విషయాన్ని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాకుండా… ఫేవరేట్ హీరోహీరోయిన్స్ కోసం ఏం చేయాడానికైనా సిద్ధమైపోతుంటారు. ఇటీవల తమకు ఇష్టమైన నటీనటుల మీద ఉన్న అభిమానాన్ని చూపించేందుకు ఫ్యాన్న్ వినూత్న దారులను ఎంచుకుంటున్నారు. సొంత గ్రామాల నుంచి పాదయాత్ర చేయడం… సైకిల్ యాత్ర చేసి వారిని కలుసుకుంటారు. మరికొందరు చేతులపై పచ్చబొట్టు వేయించుకోవడం చూస్తుంటారు. కానీ తాజాగా ఓ అభిమాని .. తన ఫేవరేట్ హీరోయిన్ సన్నీలియోన్ (Sunny Leone) మీద అభిమానంతో ఆమె ఫ్యాన్స్‏కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. సన్నీ లియోన్ అభిమానులకు తన షాపులో చికెన్ 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించాడు. దీంతో అతని షాపు వద్ద జనాలు బారులు తీరారు. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది.. సన్నీ లియోన్ అభిమానులకు కొన్ని కండీషన్స్ పెట్టాడు. అతను పెట్టిన షరతులు విని నోరెళ్లబెట్టారు సన్నీ ఫ్యాన్స్.

అసలు విషయానికి వస్తే.. కర్ణాటకలోనే మాండ్యా నగరంలో ప్రసాద్ అనే వ్యక్తికి చికెన్ షాపు ఉంది. అతను బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ వీరాభిమాని. ఇటీవల తన దుకాణంలో చికెన్ కొనుగోలు చేసే సన్నీ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన షాపులో చికెన్ కొనుగోలు చేసే సన్నీ లియోన్ అభిమానులకు 10 శాతం డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న జనాలు అతడి షాపు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తాను పెట్టిన కండిషన్స్ వివరించాడు. ఆ షరతులు ఫాలో అయిన వారికి మాత్రమే చికెన్ కొనుగోలు పై డిస్కౌంట్ ఉంటుందని చెప్పాడు. ఆ షరతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.

1. ముందుగా.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో సన్నీ లియోన్ ఖాతాలను ఫాలో కావాల్సి ఉంటుంది. సన్నీ లియోన్ సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలను ఫాలో కావాలి. 2. వారి ఫోన్లలో సన్నీ లియోన్ ఫోటోస్ కనీసం 10 అయినా సేవ్ చేసి ఉండాలి. 3. సన్నీ లియోన్ సినిమాలపై.. ఆమె సోషల్ మీడియా ఫోటోలకు లైక్స్, కామెంట్స్ చేసి ఉండాలి.

ఈ మూడు షరతులు ఫాలో అయిన వారికి మాత్రమే తన షాపు చికెన్ కొనుగోలు పై 10 డిస్కౌంట్ ఉంటుందని తెలిపాడు ప్రసాద్. ఈ ఆఫర్ సంవత్సరమంతా ఉంటుందని తెలిపాడు సదరు షాపు యాజమాని. సన్నీ లియోన్ తనకు ఇష్టమైన నటి అని.. ఆమె ఎంతో మంది అనాథ పిల్లలకు తల్లిగా మారిందని.. తనకు వచ్చే ఆదాయాన్ని పేదలకు.. అనాథలకు అందిస్తూ వారికి సేవ చేస్తుందని.. ఈ విషయాలు తనకు ఎంతో స్పూర్తి కలిగించాయని.. అందుకే సన్నీ లియోన్ అభిమానులకు ఈ ఆఫర్ ప్రకటించినట్లు చెప్పుకొచ్చాడు ప్రసాద్. ఏడాది పొడవునా సన్నీ లియోన్ అభిమానులకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపాడు..

Sunny

Sunny

Also Read: NTR: ఫిమేల్ లీడ్స్‌ పేవరెట్‌గా కొమురం భీముడు.. తారక్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్

K.G.F Chapter 2: రాకీభాయ్ స్టామినా.. అక్కడ భారీ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న కేజీఎఫ్ చాప్టర్-2..

Acharya: టాప్‌లో ట్రెండ్ అవుతున్న మెగాస్టార్ మూవీ ట్రైలర్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఆచార్య..

Mirnalini Ravi: మైమరపిస్తున్న ముద్దుగుమ్మ మృణలిని లేటెస్ట్ ఫొటోస్..