NTR: ఫిమేల్ లీడ్స్‌ పేవరెట్‌గా కొమురం భీముడు.. తారక్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్

NTR: ఫిమేల్ లీడ్స్‌ పేవరెట్‌గా కొమురం భీముడు.. తారక్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్
Ntr

లోపల ఒరిజినల్ అలాగే వుంది అనే డైలాగ్ రిపీట్ చేస్తున్నారు యంగ్‌టైగర్ ఎన్టీఆర్(NTR). కొమురంభీముడిగా జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో అలరించిన తారక్.. నెక్ట్స్ లైనప్‌లో రొమాంటిక్ ఫ్లేవర్స్ మిస్సయ్యే ఛాన్సే లేదట.

Rajeev Rayala

|

Apr 14, 2022 | 8:13 PM

లోపల ఒరిజినల్ అలాగే వుంది అనే డైలాగ్ రిపీట్ చేస్తున్నారు యంగ్‌టైగర్ ఎన్టీఆర్(NTR). కొమురంభీముడిగా జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో అలరించిన తారక్… నెక్ట్స్ లైనప్‌లో రొమాంటిక్ ఫ్లేవర్స్ మిస్సయ్యే ఛాన్సే లేదట. ఆ మేరకు ఫిమేల్ లీడ్స్‌ నుంచి హింట్స్ కూడా వస్తున్నాయి. టఫ్‌గా కనిపిస్తారు గానీ.. మాట వింటారు.. అంటూ ఆన్‌స్క్రీన్‌లో ఇచ్చిన సర్టిఫికెట్‌నే ఆఫ్‌స్క్రీన్‌లో కూడా రిపీట్ చేస్తున్నారు అరవింద. రిసెంట్‌గా ట్విట్టర్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఎన్టీయార్ సిన్సియారిటీ గురించి పంక్చువాలిటీ గురించి గొప్పగా చెప్పారు పూజాహెగ్డే. ఇలా సౌత్ అండ్ నార్త్ తేడా లేకుండా చాలామంది టాప్ హీరోయిన్స్ గుండెల్లో ప్లేస్ కొట్టేశారు యంగు యముడు. ట్రిపులార్‌లో కొమురంభీముడి లవ్‌ ఇంట్రస్ట్‌గా నటించిన ఇంగ్లీష్ యాక్టర్‌ ఒలివియో మోరిస్.. ఇప్పటికీ తారక్ జ్ఞాపకాల్లోంచి బైటికి రాలేకపోతున్నారట. ఆయనతో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. తారక్‌ సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌ అంటూ తన ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకున్నారు.

ట్రిపులార్‌లో చెర్రీ కంపానియన్ ఆలియా కూడా ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌కి ఫిదా అయ్యానంటున్నారు. సెట్స్‌ మీద తారక్‌ బిహేవియర్‌ని, ఆయనకుండే మెమొరీ పవర్‌ని పదేపదే పొగిడేశారు. కొరటాలతో ఎన్టీయార్ చెయ్యబోయే నెక్ట్స్‌ మూవీలో ఆలియానే హీరోయిన్‌గా నటిస్తారట. వీళ్లిద్జరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీపై ఇప్పటికే ఎక్‌స్పెక్టేషన్స్‌ భారీగా పెరిగిపోయాయి. బాలీవుడ్ బబూల్ దీపికా చూపు కూడా తారక్ వైపే వుందిప్పుడు. గెహ్రరియాన్ ప్రమోషన్స్‌లో తన ఫేవరిట్ హీరోల గురించి చెబుతూ ఎన్టీయార్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. తారక్ పర్సనాలిటీ సూపర్‌.. అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్రస్తుతం నాగీ మూవీలో ప్రభాస్‌కి జోడీగా నటిస్తున్న దీప్స్.. సౌత్‌లో తన నెక్ట్స్ స్టాప్ నందమూరి కాంపౌండేనని చెప్పకనే చెప్పేశారు. ఇలా సెలబ్రిటీ సర్కిల్స్‌లో తారక్‌కుండే ఫిమేల్ ఫాలోయింగ్‌ పెరుగుతూనే వుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్

Anasuya Bharadwaj: నీలిరంగు చీరలోనా చందమామ నీవే జాణ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోస్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu