Watch Video: ప్లీజ్.. మీ కాళ్లు మొక్కనివ్వండన్న జాంటీ రోడ్స్.. వద్దని వారించిన సచిన్.. వైరల్ వీడియో

ఐపీఎల్ 2022లో బుధవారం ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత, చాలా ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ముంబై వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు.

Watch Video: ప్లీజ్.. మీ కాళ్లు మొక్కనివ్వండన్న జాంటీ రోడ్స్.. వద్దని వారించిన సచిన్.. వైరల్ వీడియో
Jonty Rhodes Touches Sachin Tendulkar's Feet
Follow us
Venkata Chari

|

Updated on: Apr 15, 2022 | 9:24 AM

MI VS PBKS: ఐపీఎల్ 2022లో బుధవారం ముంబై ఇండియన్స్(Mumbai Indians) వర్సెస్ పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత, చాలా ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ముంబై వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్టేడియంలో చేసిన ఓపనికి ఆటగాళ్లు, ప్రేక్షకులందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. సచిన్ టెండూల్కర్ ముంబై జట్టుకు మెంటార్‌గా ఉన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం పంజాబ్ జట్టు సభ్యులందరితో ఒక్కొక్కరుగా కరచాలనం చేస్తున్నారు. పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లేతో సచిన్ కాసేపు మాట్లాడాడు. ఆపై జాంటీ రోడ్స్ వంతు వచ్చింది. సచిన్‌తో కరచాలనం చేకుండా రోడ్స్.. సచిన్ పాదాలను తాకి సెల్యూట్ చేసేందుకు ప్రయత్నించాడు. సచిన్ వెంటనే ఆయనను అడ్డుకోవడంతో ఆటగాళ్లిద్దరూ ఒకరికొకరు కరచాలనం చేసుకుని, ఓ హగ్ ఇచ్చి, ముందుకు కదిలారు. దీంతో పక్కనే ఉన్న ఆటగాళ్లంతా నవ్వుకోవడం మొదలుపెట్టారు.

గతంలో ముంబై ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన జాంటీ రోడ్స్..

చాలా కాలం పాటు ముంబై ఇండియన్స్ సపోర్టు స్టాఫ్‌లో జాంటీ రోడ్స్ ఉన్నాడు. అతను జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. అతను 2017లో ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టాడు. క్రికెట్ దేవుడుగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు భారత క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా నిలిచాడు. సచిన్‌కి ఉన్న ప్రజాదరణ కూడా అలాంటిదే. దీంతో ప్రపంచవ్యాప్తంగా సచిన్‌ను క్రికెట్ దేవుడు అని కూడా పిలుస్తుంటారు.

గతంలో యువరాజ్ కూడా..

గతంలో 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన ఎంఎస్‌సీ vs రెస్ట్ ఆఫ్ వరల్డ్ మ్యాచ్‌లో కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. సచిన్ ఎంసీసీ తరపున ఆడాడు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టు నుంచి ఆడిన భారత బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ మైదానంలో సచిన్ పాదాలను తాకి నమస్కరించాడు.

Also Read: IPL 2022: రూ. 30 లక్షల ప్లేయర్‌ను ఆడించండి.. ముంబై వరుస పరాజయాలకు బ్రేక్ పడొచ్చంటోన్న ఫ్యాన్స్..

IPL 2022: ఇన్నింగ్స్ అయ్యాక హార్దిక్.. మ్యాచ్ పూర్తి కాగానే బట్లర్.. పీక్స్‌కు చేరిన పోటీ.. 15 నిమిషాల్లో సీన్ రివర్స్..