AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఇన్నింగ్స్ అయ్యాక హార్దిక్.. మ్యాచ్ పూర్తి కాగానే బట్లర్.. పీక్స్‌కు చేరిన పోటీ.. 15 నిమిషాల్లో సీన్ రివర్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గుజరాత్ టైటాన్స్ (GT) 37 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (RR)పై విజయం సాధించి నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ సందర్భంగా ఆరెంజ్ క్యాప్ విషయంలో హార్దిక్ పాండ్యా, బట్లర్ మధ్య ఆసక్తికర పోరు సాగింది.

IPL 2022: ఇన్నింగ్స్ అయ్యాక హార్దిక్.. మ్యాచ్ పూర్తి కాగానే బట్లర్.. పీక్స్‌కు చేరిన పోటీ.. 15 నిమిషాల్లో సీన్ రివర్స్..
Ipl 2022 Orange Cap
Venkata Chari
|

Updated on: Apr 15, 2022 | 8:08 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో గుజరాత్ టైటాన్స్ (GT) మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. గురువారం (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 37 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (RR)పై విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో నాలుగో విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ క్యాప్(Orange Cap) విషయంలో హార్దిక్ పాండ్యా, జోస్ బట్లర్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు బట్లర్ 218 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కలిగి ఉన్నాడు. అదే సమయంలో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 141 పరుగులతో టాప్-10లో కూడా లేడు. కానీ, గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో, హార్దిక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కాసేపు ఆరెంజ్ క్యాప్ పొందగలిగాడు.

ఇన్నింగ్స్‌కు ముందు బట్లర్.. తర్వాత హార్దిక్..

కెప్టెన్ హార్దిక్ పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 87 పరుగులు చేశాడు. ఇటువంటి పరిస్థితిలో, గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, హార్దిక్ 228 పరుగులతో బట్లర్‌ను అధిగమించాడు. ఇన్నింగ్స్ విరామ సమయంలో, హార్దిక్‌కు ఆరెంజ్ క్యాప్ ఇచ్చారు. కానీ, ఈ క్యాప్ అతనితో ఎక్కువ సమయం ఉండలేకపోయింది.

మ్యాచ్ ముగిశాక అగ్రస్థానానికి చేరిన బట్లర్..

రాజస్థాన్ రాయల్స్ 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగినప్పుడు, బట్లర్ క్యాప్ అందుకోవడానికి కేవలం నాలుగు బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇన్నింగ్స్ ఓపెనింగ్ బంతిని తృటిలో తప్పించుకున్న అతను మహ్మద్ షమీ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టడం ద్వారా 10 పరుగుల ఖాళీని పూరించాడు. మొత్తం 54 పరుగులు చేసిన తర్వాత బట్లర్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఫలితంగా ఆరెంజ్ క్యాప్ రేసులో హార్దిక్ పాండ్యాను అధిగమించాడు.

IPL 2022లో అత్యధిక పరుగులు (24వ మ్యాచ్ వరకు):

జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్): 272 పరుగులు

హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్): 228 పరుగులు

శివమ్ దూబే (చెన్నై సూపర్ కింగ్స్): 207 పరుగులు

శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్): 200 పరుగులు

షిమ్రాన్ హిట్మెయర్ (రాజస్థాన్ రాయల్స్): 197 పరుగులు

శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్): 197 పరుగులు

Also Read: Watch Video: రాకెట్ కంటే వేగం.. ఇలా రనౌట్ చేస్తే బ్యాటర్లకు కష్టమే.. వైరల్ వీడియో

Rohit Sharma IPL 2022: రోహిత్ శర్మపై వేటు పడనుందా.. తర్వాతి మ్యాచ్‌లో అలా చేస్తే నిషేధమే?