IPL 2022: హార్దిక్ పాండ్యాకు లక్ష రూపాయల నష్టం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
IPL 2022: రాజస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యాకి లక్ష రూపాయల నష్టం జరిగింది. కానీ హార్దిక్ పాండ్యా హీరో ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్
IPL 2022: రాజస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యాకి లక్ష రూపాయల నష్టం జరిగింది. కానీ హార్దిక్ పాండ్యా హీరో ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ పతనం తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అతడిని ఔట్ చేసే క్రమంలో హార్దిక్ పాండ్యా లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. సంజూని రనౌట్ చేసే క్రమంలో హార్దిక్ పాండ్యా మిడిల్ స్టంప్‌ను పగలగొట్టాడు. డైరెక్ట్ త్రో విసరగా అది నేరుగా మిడిల్ స్టంప్‌కి వెళ్లింది. బలంగా తాకడంతో అది విరిగిపోయింది. దీంతో ఆ ఖర్చు హార్దిక్ ఖాతాలో పడింది. నిజానికి IPL లేదా వైట్ బాల్ క్రికెట్‌లో ఉపయోగించే ఒక LED స్టంప్ విలువ లక్ష రూపాయలు ఉంటుంది.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) విజృంభించాడు. 52 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 193 పరుగుల విజయలక్ష్యంతో ఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. బట్లర్ మాత్రం 24 బంతుల్లో 54 (8 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజ్ శాంసన్ రనౌట్ అయ్యాడు.
Hardik pandya Run out Sanju Samson and broken costly stump with lovely throw!
Hardik is now Orange Cap Holder now Scored 87* not out ( man of the match) #GTvsRR #HardikPandya #IPL2022 pic.twitter.com/Qwdf4luXNb
— Rahulsarsar (@Rahulsarsar177) April 14, 2022