Whom to Consult: మహిళలు తరచుగా కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. ఏ వైద్య నిపుణుడిని సంప్రదించాలంటే..

Whom to Consult: ఎవరైనా సరే వ్యాధి రోగనిర్ధారణ.. దానికి తగిన చికిత్స తీసుకోవడం..అందుకు తగిన డాక్టర్ ను ఎంచుకోవడంతోనే సగం వ్యాధి తగ్గినట్లేనని.. అది రోగికి సాధించిన విజయంలో సగం..

Whom to Consult: మహిళలు తరచుగా కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. ఏ వైద్య నిపుణుడిని సంప్రదించాలంటే..
Women Medical Disciplines
Follow us
Surya Kala

|

Updated on: Apr 16, 2022 | 2:36 PM

Whom to Consult: ఎవరైనా సరే వ్యాధి రోగనిర్ధారణ.. దానికి తగిన చికిత్స తీసుకోవడం..అందుకు తగిన డాక్టర్ ను ఎంచుకోవడంతోనే సగం వ్యాధి తగ్గినట్లేనని.. అది రోగికి సాధించిన విజయంలో సగం అని వైద్య నిపుణులు అంటున్నారు. ఒకొక్కసారి తమకు వచ్చిన వ్యాధి ఏమిటనేది.. రోగి నిర్ధారించుకోవడం…  సరైన నిపుణుడిని సంప్రదించడం సాధారణ వ్యక్తికీ కష్టమని అంటున్నారు. అయితే ఈరోజు కడుపు ఉబ్బరం లక్షణాలు ఏమిటి.. ఏ సమయంలో వైద్యుడిని సంప్రదించాలో ఈరోజు తెలుసుకుందాం..

దేశంలో వాతావరణ మార్పులతో పాటు.. పాదరసం (mercury) కూడా పెరుగుతోంది. దీంతో మహిళల్లో కడుపు ఉబ్బరం( bloating) సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి తాపానికి.. కడుపు ఉబ్బి. అసౌకర్యంగా అనిపించడం వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. మన శరీరం చెమట ద్వారా వేడిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు శరీరం ఎక్కువ శాతం నీటిని కోల్పోతుంది. దీని ఫలితంగా డీ హైడ్రేషన్ ఏర్పడుతుంది. అప్పుడు తగినంత నీటిని, ద్రవ పదార్ధాలను మనం శరీరానికి అందించకపోతే… అప్పుడు కడుపు ఉబ్బరానికి కారణం కావచ్చు. ఉబ్బిన కడుపు బిగుతుగా, నిండుగా అనిపిస్తుంది. నొప్పి బాధాకరంగా ఉంటుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. ఒకొక్కసారి ఉబ్బిన పొత్తికడుపు లేనప్పటికీ.. మీకు కడుపు నిండుగా ఉబ్బినట్లు అనిపించవచ్చు. నిజానికి ఉబ్బరం సాధారణంగా జీర్ణ సమస్య.  అయితే హార్మోన్లు, ఒత్తిడి కూడా కడుపు ఉబ్బరానికి పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు వైద్య నిపుణులను సంప్రదించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.

హార్మోన్లు, జీర్ణక్రియ రెండూ ఉబ్బరం వెనుక కారణాలు అయితే, రోగి ఏ నిపుణుడిని సందర్శించాలి?

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా గైనకాలజిస్ట్? 

న్యూ ఢిల్లీలోని శాంతాహ ఫెర్టిలిటీ సెంటర్ వసంత్ విహార్‌కు చెందిన మెడికల్ డైరెక్టర్ , ఐవిఎఫ్ నిపుణురాలు డాక్టర్ అనూభా సింగ్.. కడుపు ఉబ్బరం నేరుగా హార్మోన్‌లకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. అయితే “ప్రీ-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎమ్‌ఎస్) లక్షణాలలో ఉబ్బరం ఒకటి అనడంలో సందేహం లేదని .. అయితే ఇది చాలా తక్కువమంది మాత్రమే వస్తుందని చెప్పారు. కడుపు ఉబ్బరానికి ప్రధాన కారణం జీర్ణ సమస్యలే.  కనుక కడుపు ఉబ్బరం అనిపిస్తే.. వైద్య సహాయం తప్పనిసరి అనిపిస్తే.. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ను సంప్రదించాలని సూచించారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కడుపు ఉబ్బరానికి ప్రధాన కారణం గ్యాస్ అధికంగా ఉత్పత్తి కావడం లేదా కడుపు ఖాళీ చేయడం ఆలస్యం లేదా రెండూ కారణాలు. ఇదే విషయంపై హిందూజా హాస్పిటల్   MRC కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ గౌరంగి షా మాట్లాడుతూ, “అధిక ప్రోటీన్ ఆహారం కారణంగా అధిక గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అన్నారు. అంతేకాదు అజీర్ణం, కడుపు ఇన్ఫెక్షన్,  లతో పాటు యాంటీబయాటిక్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు,పెయిన్ కిల్లర్స్ వంటివి కూడా కడుపు ఉబ్బరానికి కారణం కావచ్చు.  అప్పుడు డాక్టర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని సంప్రదించాలని డాక్టర్ గౌరంగి షా చెప్పారు. అంతేకాదు.. “ఒక వ్యక్తి రాత్రి భోజనానికి..  నిద్రపోయే సమయానికి మధ్య మూడు-నాలుగు గంటల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలని.. లేదంటే అటువంటి వ్యక్తులు అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి వ్యాధుల బారిన పడతారని అన్నారు.

కొంతమంది మహిళల్లో ” హైపోథైరాయిడిజం, తక్కువ పొటాషియం స్థాయి, రుతుక్రమం ఆగిపోయిన కాలం (తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయి కారణంగా) వంటి వివిధ పరిస్థితుల కారణంగా పేగు చలనశీలత(కండరాల సంకోచం) తగ్గుతుంది.” అని డాక్టర్ షా అన్నారు.

కడుపు ఉబ్బరం సర్వ సాధారణం? క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. 10 శాతం నుంచి 25 శాతం మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులు అప్పుడప్పుడు పొత్తికడుపు ఉబ్బరం గురించి ఫిర్యాదు చేస్తారు. 75 శాతం మంది తమ లక్షణాలను మోస్తరు నుండి తీవ్రమైనవిగా వివరిస్తారు. దాదాపు 10 శాతం మంది తాము దీన్ని క్రమం తప్పకుండా అనుభవిస్తున్నామని చెప్పారు.  75 శాతం మంది మహిళలు రుతు క్రమానికి ముందు సమయంలో ఉబ్బరం అనుభవిస్తారు. ఉబ్బరం అనుభవించేవారిలో 50 శాతం మందిలో పొత్తికడుపు బాధకూడా ఏర్పడతుంది.

ఉబ్బరం తీవ్రమైన వ్యాధిగా మారకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు:  మీ దినచర్యలో తగినంత  ద్రవ పదార్ధాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం నీటిని తాగడం వలన ఉబ్బరం నివారించవచ్చు. డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, “గ్రీన్ టీ తాగడం, అల్పాహారానికి ముందు నీరు త్రాగడం వల్ల మీ కడుపు వేడెక్కుతుంది.” ఇది మీ మొత్తం జీర్ణవ్యవస్థలో చలనశీలతను ప్రోత్సహిస్తుందని అన్నారు.

డాక్టర్ షా కూడా ఇలా అన్నారు, “ఎవరైనా  BP లేదా మధుమేహం తో బాధపడుతున్నవారు అయితే.. వారికీ  అకస్మాత్తుగా అసిడిటీ లేదా గ్యాస్ లేదా పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడినట్లయితే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.  గుండెపోటు అవునో కాదో నిర్ధారించుకోవడానికి  ECG చేయించుకోమని సూచిస్తున్నారు. ఎందుకంటే 50 శాతం మందిలో  గుండెపోటు అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లెమ్ తోనే మొదలవుతుందని అన్నారు.

Read Also: 

Hanuman Shobha Yatra: కొనసాగుతున్న హనుమాన్‌ శోభయాత్ర.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!