పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి.. సీఎం సంతాపం

Simran Singh: ఆర్‌జే, పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పదంగా మృతి చెందింది. తన అపార్ట్‌మెంట్‌లోనే శవమై కనిపించింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సిమ్రాన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఏడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డిసెంబర్ 13న చివరిగా పోస్ట్‌ చేశారు. గురుగ్రామ్ అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించడంతో ఆమెతో పాటు ఉంటున్న స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించింది.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి.. సీఎం సంతాపం
Simran Singh
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 26, 2024 | 8:46 PM

25 ఏళ్ల ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రముఖ ఫ్రీలాన్స్ రేడియో జాకీ సిమ్రాన్ సింగ్ సెక్టార్ 47లోని తన గురుగ్రామ్ అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సిమ్రాన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఏడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డిసెంబర్ 13న చివరిగా పోస్ట్‌ చేశారు. ఆమె సెక్టార్ 47 అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించడంతో ఆమెతో పాటు ఉంటున్న స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె ఆత్మహత్య చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సిమ్రాన్‌ను ఆమె అభిమానులు ముద్దుగా “జమ్మూ కి ధడ్కన్” (జమ్మూ హృదయ స్పందన) అని పిలుచుకుంటారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా,  J&K ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సిమ్రాన్ సింగ్ మరణం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. JKNC  అధికారిక X హ్యాండిల్‌లో ట్విట్  చేసింది. “డా. JKNC అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘జమ్మూ కి ధడ్కన్‌గా పిలవబడే సిమ్రాన్ సింగ్అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ ఈ క్లిష్ట సమయంలో డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా సిమ్రాన్ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు తమ హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె ఆత్మీయులకు ఈ అనూహ్యమైన నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని వారు ప్రార్థించారు” అని ట్విట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి