AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annamalai: అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

Anna University Incident: చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రస్థాయిలో స్పందించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో డీఎంకే సర్కారు పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చెప్పులు వేసుకోబోనని ఆయన ప్రకటించారు.

Janardhan Veluru
|

Updated on: Dec 26, 2024 | 6:03 PM

Share

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేను అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు వేసుకోబోనని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ.. ఇకపై తాను రెగ్యులర్ రాజకీయాలు చేయబోనని అన్నారు. డీఎంకేను గద్దె దించేందుకు శుక్రవారంనాటి నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి సుబ్రహ్మణ్యస్వామిని వేడుకుంటానని తెలిపారు. డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటలకు తనకు తాను కొరడా దెబ్బలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఎవరూ కొరడాలతో కొట్టుకోవద్దని ఆయన అభ్యర్థించారు.

బీజేపీ కార్యకర్తలంతా తమ ఇంటి ఎదుట డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. తమ ప్రాంతాల్లోని బాధిత మహిళలు, వారి కుటుంబాలకు బీజేపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌కు కూడా లేఖ రాయనున్నట్టు తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించలేని పార్టీకి.. అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. తమిళనాడులో నాగరిక రాజకీయాలు తావు లేనందున.. ఇక నుంచి తన రాజకీయాలు భిన్నంగా ఉంటాయని అన్నామలై అన్నారు.

అన్నామలై అన్నామలై అన్నా యూనివర్శిటీలో సీసీ కెమెరా లేదని అనడం సిగ్గుచేటని ప్రశ్నించారు.నిర్భయ ఫండ్ కేటాయించిన అన్నా యూనివర్శిటీలో సీసీ కెమెరా లేదని అన్నారు. అన్నామలై కూడా డీఎంకేను అధికారం నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని, మీడియా సమావేశం అనంతరం బూట్లు విప్పబోనని ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే పాలన ముగిసిన తర్వాతే బూట్లు ధరిస్తానని, 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మురుగన్‌లోని ఆరు ఇళ్లను సందర్శించి డీఎంకే వ్యతిరేక రాజకీయాలను చాలా సీరియస్‌గా ముందుకు తీసుకెళ్తానని అన్నామలై చెప్పారు.

అన్నా యూనివర్శిటీలో సీసీ కెమెరా లేదని అనడం సిగ్గుచేటని ప్రశ్నించారు. నిర్భయ ఫండ్ కేటాయించినా.. అన్నా యూనివర్శిటీలో కనీసం సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అన్నా యూనివర్సిటీ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్‌ను బహిర్గతం చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎంకేను అధికారం నుంచి దించే వరకు పాదరక్షలు వేసుకోనంటూ మీడియా సమక్షంలో తన పాదరక్షలు తీసేవారు. తమిళనాడులో డీఎంకే పాలన ముగిసిన తర్వాతే బూట్లు ధరిస్తానని ప్రకటించారు. 48 రోజుల పాటు వ్రతం ఉండి తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి ఆరు ఆలయాలను సందర్శించనున్నట్లు తెలిపారు. ఇక డీఎంకే వ్యతిరేక రాజకీయాలను చాలా సీరియస్‌గా ముందుకు తీసుకెళ్తానని అన్నామలై చెప్పారు.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!